Site icon NTV Telugu

స్వరోవ్‌స్కీ క్రిస్టల్స్‌తో లగ్జరీ డిజైన్.. కొత్తగా రాబోతున్న Motorola Edge 70 Swarovski Edition..!

Motorola Edge 70 Swarovski Edition

Motorola Edge 70 Swarovski Edition

Motorola Edge 70 Swarovski Edition: మోటరోలా మరోసారి లగ్జరీ, స్టైల్‌ను కలగలిపిన ప్రత్యేక స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకు వచ్చే ప్రయత్నంలో ఉంది. ఇటీవల విడుదలైన Motorola Edge 70 తరువాత, ఇప్పుడు దాని ప్రత్యేకమైన Swarovski Edition సంబంధించి ఫోటోలు లీక్ కావడంతో ఆన్‌లైన్‌లో చర్చనీయాంశంగా మారింది. లీక్ అయినా ప్రమోషనల్ పోస్టర్ ప్రకారం ఈ ఫోన్ Pantone “Cloud Dancer” అనే సాఫ్ట్ క్రీమీ వైట్ కలర్‌లో ఆకట్టుకునేలా డిజైన్ చేయబడింది.

IND vs SA: నేడు దక్షిణాఫ్రికాతో రెండో వన్డే.. భారత జట్టులో మార్పు?, ఒక్క మ్యాచ్‌కే పక్కనపెడితే!

2026 సంవత్సరానికి పాంటోనే (Pantone) అధికారిక రంగుగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ షేడ్‌ను వెగన్ లెదర్ బ్యాక్ ఫినిష్‌తో జత చేయడంతో మరింత స్టైలిష్ లుక్ వచ్చింది. వెనుక భాగంలో 14 అసలైన స్వరోవ్‌స్కీ క్రిస్టల్స్ అమర్చడం ఈ ఎడిషన్‌కు ప్రత్యేకమైన లగ్జరీ టచ్‌ను అందిస్తోంది. అంతేకాకుండా ఈ ఫ్రేమ్‌పై “PANTONE Cloud Dancer” ఇంగ్రేవింగ్ ఇవ్వడం ద్వారా ప్రీమియమ్ బ్రాండింగ్‌ను హైలైట్ చేశారు.

ఈ ఏడాది మోటరోలా విడుదల చేస్తున్న రెండవ స్వరోవ్‌స్కీ థీమ్ మొబైల్ ఇది. ఇంతకుముందు Razr 60 కి కూడా స్వరోవ్‌స్కీ స్పెషల్ ఎడిషన్ వచ్చింది. రాబోయే ఈ మొబైల్ ధర వివరాలు ఇంకా వెల్లడించకపోయినా.. యూరప్‌లో సాధారణ Edge 70 ధర దాదాపు €799 నుండి ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. ఈ ప్రత్యేక ఎడిషన్ మరింత ఖరీదైన ప్రీమియమ్ ఎడిషన్‌గా ఉండొచ్చని అంచనా.

Viral Video: పానీపూరి కోసం నోరు తెరిచిన మహిళ.. పట్టుకున్న దవడ కండరాలు

హార్డ్‌వేర్ పరంగా ఎలాంటి మార్పులు చేయకుండా.. స్టాండర్డ్ Edge 70 లో ఉన్న అన్ని ఫీచర్లు ఇదే మోడల్‌లో కూడా కొనసాగుతున్నాయి. ఇందులో 6.7 అంగుళాల 120Hz P-OLED డిస్‌ప్లే, IP68 + IP69 ప్రొటెక్షన్ రేటింగ్స్, Snapdragon 7 Gen 4 ప్రాసెసర్, 12GB RAM, 512GB వరకు స్టోరేజ్, 50MP ట్రిపుల్ రియర్ కెమెరాలు, 4800mAh బ్యాటరీతో వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్, Android 16 తోపాటు నాలుగు మెజర్ OS అప్డేట్‌ల హామీ వంటి ఫీచర్లు ఉన్నాయి. 5.99mm మాత్రమే మందం కలిగిన అల్ట్రాస్లిమ్ డిజైన్ కూడా అదేవిధంగా కొనసాగుతుంది. ఈ ప్రత్యేక స్వరోవ్‌స్కీ ఎడిషన్ అధికారికంగా ఎప్పుడు లాంచ్ అవుతుందనే వివరాలు ఇంకా లేవు. అయితే లీక్ కంటెంట్ చాలా క్లియర్‌గా ఉండటంతో, మోటరోలా త్వరలోనే దీనిని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

Exit mobile version