Site icon NTV Telugu

మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, OLED క్వాడ్ కర్వ్డ్ డిస్‌ప్లే వంటి ప్రీమియం ఫీచర్స్ తో Motorola edge 70 fusion..!

Motorola Edge 70 Fusion

Motorola Edge 70 Fusion

Motorola edge 70 fusion: మోటరోలా (motorola) తన పాపులర్ Edge సిరీస్ ను మరింత పెంచుకునేందుకు సిద్ధమైంది. ఈ సిరీస్‌లో త్వరలోనే మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ (motorola edge 70 fusion) స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు సమాచారం. లేక్స్ ద్వారా ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్లు బయటకు వచ్చాయి.

స్లిమ్ బాడీ.. మ్యాసివ్ పవర్! 144Hz డిస్‌ప్లే, Snapdragon 8 ఎలైట్ తో REDMAGIC 11 Air లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా..!

లీక్ ప్రకారం డిజైన్ పరంగా పెద్ద మార్పులు లేకపోయినా.. పర్ఫార్మెన్స్, బ్యాటరీ విభాగాల్లో భారీ అప్‌గ్రేడ్స్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రాసెసర్ గా Snapdragon 7s Gen 3 చిప్‌ను ఉపయోగించనున్నట్లు లీక్ సమాచారం. అంతేకాదు బ్యాటరీ సామర్థ్యాన్ని కూడా 5500mAh నుంచి భారీగా 7000mAhకి పెంచినట్లు సమాచారం. అలాగే 6.78 అంగుళాల 1.5K OLED క్వాడ్ కర్వ్డ్ డిస్‌ప్లే ఉండనుంది. ఇది HDR10+, 144Hz రిఫ్రెష్ రేట్, 5200 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్ చేస్తుంది.

పర్ఫార్మెన్స్ విషయంలో ఈ ఫోన్ 4nm టెక్నాలజీపై రూపొందిన Snapdragon 7s Gen 3 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో రానుంది. దీనితో పాటు Adreno 720 GPU, 8GB లేదా 12GB RAM, 256GB స్టోరేజ్ ఆప్షన్లు ఉంటాయని సమాచారం. ఈ మొబైల్ Android 16పై పనిచేస్తూ 3 సంవత్సరాల OS అప్డేట్స్, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ ను అందించనుంది. కెమెరా vibagamloSony LYTIA సెన్సార్‌తో 50MP రియర్ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరాలు ఉండనున్నాయి. ఆడియో కోసం స్టీరియో స్పీకర్లు, డాల్బీ ఆటమ్స్ సపోర్ట్ ఉంటుంది. భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అందించనున్నారు.

Nari Nari Naduma Murari: శ్రీవిష్ణు స్థానంలో నేను ఉంటే చేసేవాడిని కాదు: శర్వానంద్ షాకింగ్ కామెంట్స్!

ఈ ఫోన్‌కు MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, అలాగే IP68 + IP69 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్లు ఉండటం మరో హైలైట్. కనెక్టివిటీకి 5G SA/NSA, Wi-Fi 6, Bluetooth 5.4, GPS, USB Type-C వంటి ఫీచర్లు ఉన్నాయి. బ్యాటరీ పరంగా 7000mAh బ్యాటరీ, 68W ఫాస్ట్ చార్జింగ్ కు సపోర్ట్ చేస్తుందని లీక్ పేర్కొంది. డిజైన్ విషయంలో ఈ ఫోన్ నైలాన్ అండ్ లినెన్ ఇన్‌స్పైర్డ్ బ్యాక్ ఫినిష్తో ఓరియంట్ బ్లూ, స్పోర్టింగ్ గ్రీన్, బ్లూ సర్ఫ్, కంట్రీ ఎయిర్, సీల్హౌఎట్టే కలర్స్‌లో వచ్చే అవకాశం ఉంది.

Exit mobile version