Site icon NTV Telugu

స్టైలిష్ డిజైన్, పవర్‌ఫుల్ సౌండ్.. Motorola 65 అంగుళాల QLED Ultra HD (4K) స్మార్ట్ గూగుల్ టీవీపై రూ.47,400 భారీ డిస్కౌంట్..!

Motorola 65 Qled Ultra Hd (4k) Smart Google Tv

Motorola 65 Qled Ultra Hd (4k) Smart Google Tv

Motorola 65 QLED Ultra HD (4K) smart Google Tv: పెద్ద స్క్రీన్ స్మార్ట్ టీవీ కొనాలనుకునేవారికి మోటరోలా (Motorola) అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది. Motorola 65 అంగుళాల QLED Ultra HD (4K) స్మార్ట్ గూగుల్ టీవీ 2025 ఎడిషన్ పై భారీ ధర తగ్గింపును అందిస్తోంది. ఈ టీవి కేవలం ధర తగ్గింపు మాత్రమే ప్రధానంగా కాకుండా ఫీచర్లలో కూడా అనేక ప్రీమియం ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా..

165 సెం.మీ (65 అంగుళాల) QLED డిస్‌ప్లేతో ఈ టీవీ వస్తోంది. Ultra HD (4K) రిజల్యూషన్ (3840×2160)తో పాటు Direct LED QLED టెక్నాలజీ ఉపయోగించారు. DLG (Dual Line Gate) టెక్నాలజీతో గేమింగ్ అనుభవం మరింత స్మూత్‌గా ఉంటుంది. అలాగే అలాగే గేమ్ యాక్సిలరేటర్ ఫీచర్ 120Hz వరకు సపోర్ట్ చేయడం గేమర్లకు ప్లస్ పాయింట్.

NTV Journalists Arrest: ఎన్టీవీ జర్నలిస్టుల అక్రమ అరెస్టులు.. అర్థరాత్రి ఇంటికొచ్చి మరీ..!

అలాగే ఈ టీవీలో 48W అవుట్‌పుట్ కలిగిన రెండు బాక్స్ స్పీకర్లు ఉన్నాయి. డాల్బీ ఆట్‌మాస్ సపోర్ట్‌తో థియేటర్ తరహా సౌండ్ అనుభూతిని ఇస్తుంది. ఇక ఇందులో 7 సౌండ్ మోడ్‌లు (మూవీ, మ్యూజిక్, స్పోర్ట్స్, న్యూస్..) అందుబాటులో ఉన్నాయి. ఇది గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ టీవీలో నెట్ఫ్లిక్, జియో హాట్స్టార్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి ప్రముఖ OTT యాప్స్ ముందుగానే అందుబాటులో ఉన్నాయి.

అలాగే ఇందులో 2GB ర్యామ్, 32GB స్టోరేజ్, క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్ ఉన్నాయి. బిల్ట్-ఇన్ Wi-Fi, స్క్రీన్ కాస్టింగ్ సపోర్ట్ కూడా లభిస్తుంది. ఇంకా కనెక్టివిటీ కోసం 3 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్, హెడ్‌ఫోన్ జాక్ అందించారు. ఈ టీవీకి 3-స్టార్ BEE ఎనర్జీ రేటింగ్ ఉంది. ఈ టీవీ అసలు ధర రూ. 88,399గా ఉన్న ఈ టీవీపై ప్రస్తుతం 53 శాతం డిస్కౌంట్ ఇవ్వడంతో కేవలం రూ. 40,999 ప్రత్యేక ధరకు లభిస్తోంది. అంతేకాదు బ్యాంక్ ఆఫర్లతో మరింత తగ్గింపు కూడా పొందవచ్చు.

Mana ShankaraVaraPrasad Garu: వీక్‌డేస్‌లోనూ హౌస్‌ఫుల్స్‌.. 24 గంటల్లో 4 లక్షల టికెట్లు!

ఈ మోటరోలా 65 అంగుళాల స్మార్ట్ టీవీపై ఇప్పటికే భారీ డిస్కౌంట్ ఉండగా.. HDFC, SBI, Flipkart Axis బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనపు క్యాష్‌బ్యాక్ లేదా ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. EMI ఆప్షన్‌తో కూడా కొనుగోలు చేసే వీలుంది.

Exit mobile version