Site icon NTV Telugu

Moto E32: మోటోరోలా నుంచి కొత్త ఫోన్.. తక్కువ ధర, ఎక్కువ ఫీచర్లు

Motorola Moto E32

Motorola Moto E32

Motorala Released Moto E32 Smartphone In India: స్మార్ట్‌ఫోన్ రంగంలో ‘షావోమీ’ (రెడ్‌మీ) తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పు కారణంగా.. మొబైల్ కంపెనీలన్నీ దిగొచ్చాయి. తక్కువ ధరలకే అధునాతన ఫీచర్లతో ఒకదానికి మంచి మరొక ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి. ఇప్పుడు ప్రముఖ ఎలక్ట్రానిక్‌ సంస్థ మోటోరోలో.. తాజాగా బడ్జెట్ ధరలోనే సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. మోటో ఈ32 పేరుతో ఇప్పటికే యూరప్‌లో ఈ ఫోన్ విడుదల కాగా.. ఇప్పుడు భారత మార్కెట్‌లో రిలీజ్ చేశారు. ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌‌ఫోన్‌ సేల్‌ కొనసాగుతోంది. అయితే.. 4జీబీ ర్యామ్‌ + 64 జీబీ స్టోరేజ్‌ వేరయింట్‌తో ఒక్క మోడల్‌నే విడుదల చేశారు.

ఇక ఫీచర్స్ విషయానికొస్తే.. 720×1,600 పిక్సెల్‌ రిజల్యూషన్‌తో కూడిన 6.5 అంగుళాల ఐపీఎస్‌ ఫుల్‌ హెచ్‌డీ + ఎల్‌సీడీ స్క్రీన్‌ కలిగి ఉంటుంది. 90Hz రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియోతో వస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్.. ఆక్టా-కోర్ మీడియా టెక్‌ హీలియో జీ37 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఈమధ్య వినియోగదారులు ఎక్కువ పిక్సెల్స్ ఉన్న కెమెరా ఫోన్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి.. ఈ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాను అందించారు. సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్‌ కెమెరా ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో.. మెమరీని మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా 1TB వరకు పెంచుకోవచ్చు. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ వంటి ఫీచర్లు ఉన్న ఈ ఫోన్.. 5,000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీతో వస్తోంది.

కాస్మిక్‌ బ్లాక్‌, ఐస్‌బర్గ్‌ బ్లూ కలర్స్‌లో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే.. 10 శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. దాంతోపాటు నో కాస్ట్‌ ఈఎమ్‌ఐ ఆఫర్లూ ఉన్నాయి. ఇంతకీ.. ఈ ఫోన్ ధర ఎంతో తెలుసా? కేవలం రూ. 10,499 మాత్రమే!

Exit mobile version