Site icon NTV Telugu

7,000mAh బ్యాటరీ, 6.72 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేతో అమ్మకాల సునామి సృష్టించడానికి సిద్దమైన Moto G36!

Moto G36

Moto G36

Moto G36: మోటోరోలా నుండి మరో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మోటో G36 త్వరలో మార్కెట్లోకి రాబోతుంది. దీనికి సంబంధించిన వివరాలు చైనా రెగ్యులేటరీ అథారిటీ TENAA వెబ్‌సైట్‌లో దర్శనమిచ్చాయి. ఈ ఫోన్ కొన్ని అప్‌గ్రేడ్ ఫీచర్లతో గత సంవత్సరం విడుదలైన మోటో G35కు అప్డేటెడ్ గా రానుంది. ఇక లిస్టింగ్ ప్రకారం, మోటో G36 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఇలా ఉన్నాయి.

డిస్‌ప్లే:
మోటో జG36 6.72 అంగుళాల TFT డిస్‌ప్లేను 1,080×2,400 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో కలిగి ఉంటుందని TENAA లిస్టింగ్ సూచిస్తుంది. ఇది మోటో G35 కంటే పెద్ద డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

ప్రాసెసర్, మెమరీ:
ఈ ఫోన్ 2.4GHz బేస్ కోర్ ఫ్రీక్వెన్సీతో ఆక్టా కోర్ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇందులో 4GB, 8GB, 12GB, 16GB RAM ఆప్షన్లు అలాగే 64GB, 128GB, 256GB, 512GB స్టోరేజ్ ఆప్షన్లు లభించే అవకాశం ఉంది.

AP Secretariat: ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. సచివాలయంలో ప్రమోషన్లు

కెమెరా:
Moto G36 వెనుక వైపు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాతో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీల కోసం ముందు వైపు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉండవచ్చని అంచనా.. ఇది మోటో G35లో ఉన్న 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కంటే అప్‌గ్రేడ్.

బ్యాటరీ:
ఈ హ్యాండ్‌సెట్‌లో 6,790mAh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీనిని మోటోరోలా 7,000mAhగా లాంచ్ చేయవచ్చు. ఇది పెద్ద బ్యాటరీ కావడంతో.. ఇది వినియోగదారులకు ఎక్కువ సేపు ఉపయోగించడానికి అవకాశం కల్పిస్తుంది.

Leica కెమెరా, 5,500mAh బ్యాటరీ, 1336 సింగిల్ కోర్ స్కోరుతో రాబోతున్న Xiaomi 15T!

డిజైన్, ఇతర ఫీచర్లు:
TENAA లిస్టింగ్ ప్రకారం, ఈ ఫోన్ పర్పుల్ రంగులో అందుబాటులో ఉంటుంది. ఇది ఫింగర్‌ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ కొలతలు 166.3×76.5×8.7mm కాగా, 210గ్రాములు ఉండనుంది.

మొత్తంగా మోటో G35 5G గత సంవత్సరం డిసెంబర్‌లో భారతదేశంలో రూ. 9,999 ధరతో విడుదలైన విషయం తెలిసిందే. కాబట్టి మోటో G36 కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా రానుంది. అయితే, మోటోరోలా ఇంకా దీని లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించలేదు.

Exit mobile version