7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్‌ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!

  • Moto G Max ఆగస్టు 14, 2026న లాంచ్..
  • డిస్‌ప్లే: 6.72 అంగుళాల FHD+ LCD, 120Hz
  • ప్రాసెసర్: Qualcomm Snapdragon 6s Gen 4
  • కెమెరా: 50MP Sony LYT-600 ప్రైమరీ కెమెరా
  • బ్యాటరీ: 7,000mAh, ఆపరేటింగ్ సిస్టమ్: Android 16
  • డ్యూరబిలిటీ: MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్..
Moto G Max

Moto G Max

Moto G Max: మోటరోలా (Motorola) సంబంధించిన G-సిరీస్‌ నుండి కొత్త స్మార్ట్‌ఫోన్ మోటో జి మాక్స్ (Moto G Max)ను భారత మార్కెట్లో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ వంటి ఫీచర్లతో ఈ ఫోన్‌ను ఆగస్టు 14న భారత్‌లో లాంచ్ కానుంది.

120Hz FHD+ డిస్‌ప్లే:

ఈ సరికొత్త మొబైల్ లో 6.72 అంగుళాల FHD+ LCD డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. దీంతో స్క్రోలింగ్, యానిమేషన్లు, గేమింగ్ సమయంలో డిస్‌ప్లే మరింత స్మూత్‌గా ఉండే అవకాశం ఉంది. డిస్‌ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i రక్షణను అందించారు. ఫోన్ డిజైన్‌లో ‘లగ్జరీ శాటిన్ ఫినిష్’ ఉంటుంది. ఫాంటోనే ఆధారిత ” ఫాంటోనే స్టార్గాజెర్, ఫాంటోనే మాలగా, ఫాంటోనే అలస్కాన్ బ్లూ” అనే మూడు కలర్ ఆప్షన్లలో ఇది అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో పాటు దుమ్ము, నీటి నుంచి అధిక స్థాయి రక్షణను అందించేలా ఫోన్‌ను రూపొందించారు.

50MP సోనీ కెమెరా & ప్రాసెసర్:

ఫోటోగ్రఫీ కోసం వెనుకవైపు 50MP సోనీ LYT-600 ప్రైమరీ కెమెరాను అందించారు. మెరుగైన సెన్సార్ ఆప్టిక్స్, సాఫ్ట్‌వేర్ ట్యూనింగ్ ద్వారా పగటి సమయంలోనే కాకుండా తక్కువ వెలుతురులోనూ మెరుగైన ఫోటోలను అందించడంపై కంపెనీ దృష్టి పెట్టింది. పనితీరు కోసం ఇందులో Qualcomm Snapdragon 6s Gen 4 SoC చిప్ సెట్ ను ఉపయోగించారు. దీనికి 6GB లేదా 8GB LPDDR5X RAM, 128GB UFS 3.1 స్టోరేజ్ జత చేశారు.

7,000mAh భారీ బ్యాటరీ:

ఈ ఫోన్‌లోని ప్రధానంగా చెప్పుకోవాలిసిన వాటిలో 7,000mAh భారీ బ్యాటరీ ఒకటి. సాధారణ వినియోగంలో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ అందించగలదని మోటరోలా తెలిపింది. ఎక్కువసేపు ఫోన్ ఉపయోగించే వారికి ఇది ప్రత్యేకంగా ఉపయోగపడే ఫీచర్‌గా చెప్పొచ్చు. సాఫ్ట్‌వేర్ పరంగా ఇందులో ఆండ్రాయిడ్ 16తో పనిచేస్తుంది. భవిష్యత్తులో 2 ఆండ్రాయిడ్ OS అప్‌గ్రేడ్లు, 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లు అందిస్తామని మోటరోలా హామీ ఇచ్చింది.

ఆడియో విషయానికి వస్తే స్టీరియో స్పీకర్లతో పాటు డాల్బీ ఆటమ్స్ సపోర్ట్ ఉంటుంది. అలాగే మోటోరోలా స్మార్ట్ కనెక్ట్ ఫీచర్ ద్వారా స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్, PC వంటి ఇతర డివైజ్‌ల మధ్య కంటెంట్‌ను సింక్ చేసుకోవడం, డిస్‌ప్లేను ఎక్స్‌టెండ్ చేసుకోవడం వంటి సదుపాయాలు లభిస్తాయి. లాంచ్ తర్వాత ఈ ఫోన్‌ను మోటోరోలా ఇండియా, ఫ్లిప్కార్ట్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. ధరను కంపెనీ లాంచ్ సమయంలో అధికారికంగా వెల్లడించనుంది.