Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!

  • సెప్టెంబర్ 15న భారత్‌లో Moto Buds 2 Fusion లాంచ్
  • 55dB వరకు డైనమిక్ ANC సపోర్ట్
  • 12.4mm టైటానియం కోటెడ్ డైనమిక్ డ్రైవర్లు
  • స్టాండ్‌అలోన్‌గా 13 గంటల ప్లేబ్యాక్
  • చార్జింగ్ కేస్‌తో మొత్తం 53 గంటల ప్లేబ్యాక్..
Moto Buds 2 Fusion

Moto Buds 2 Fusion

Moto Buds 2 Fusion: భారత్‌లో మోటోరోలా (Motorola) పర్సనల్ ఆడియో పోర్ట్‌ఫోలియోను మరింత పెంచనుంది. ఇప్పటికే మోటో బడ్స్ 2 విడుదలైన తర్వాత ఇప్పుడు మోటో బడ్స్ 2 ఫ్యూజన్‌ (Moto Buds 2 Fusion)ను తీసుకురానుంది. ఈ కొత్త ట్రూ వైర్‌లెస్ స్టీరియో (TWS) ఇయర్‌బడ్స్ ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో జాబితా చేయబడ్డాయి. సెప్టెంబర్ 15న విడుదల కాబోతున్న ఈ ఇయర్‌బడ్స్ హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్లు, డిజైన్ వివరాలు, కలర్ వేరియంట్లు ఇప్పటికే కంపనీ ధృవీకరించింది.

మోటో బడ్స్ 2 ఫ్యూజన్ మిడ్-టైర్ సెగ్మెంట్‌లో మోటో బడ్స్ 2, మోటో బడ్స్ 2 ప్లస్‌తో పాటు స్థానం సంపాదించనుంది. ఇవి అధిక బ్యాటరీ కెపాసిటీ, యాక్టివ్ నాయిజ్ క్యాన్సిలేషన్, ఆధునిక వైర్‌లెస్ కనెక్టివిటీపై దృష్టి సారించాయి. ఈ ఇయర్‌బడ్స్‌లో 12.4mm డైనమిక్ డ్రైవర్లు ఉన్నాయి. వీటిపై టైటానియం కోటింగ్ ఉంది. మోటోరోలా ప్రొప్రైటరీ అకౌస్టిక్ ట్యూనింగ్‌తో పాటు డైనమిక్ యాక్టివ్ నాయిజ్ క్యాన్సిలేషన్ (ANC) 55dB వరకు అందిస్తాయి. అలాగే దీనికి ట్రాన్స్‌పరెన్సీ మోడ్ కూడా ఉంది. కాల్స్ సమయంలో బ్యాక్‌గ్రౌండ్ నాయిజ్‌ను తగ్గించేందుకు 6-మైక్రోఫోన్ సెటప్ (ప్రతి ఇయర్‌బడ్‌కు 3)తో క్రిస్టల్‌టాక్ AI అల్గారిథమ్స్ ఉన్నాయి. స్పేషియల్ ఆడియో, కస్టమైజబుల్ EQతో బాస్ బూస్ట్, AAC, SBC బ్లూటూత్ కోడెక్స్‌లు మద్దతు ఇస్తాయి.

బ్లూటూత్ 6.0తో డ్యూయల్-డివైస్ కనెక్షన్, ఆటోమేటిక్ సోర్స్ స్విచింగ్ ఉన్నాయి. ప్రతి బడ్‌లో 62mAh బ్యాటరీ, చార్జింగ్ కేస్‌లో 530mAh బ్యాటరీ ఉంది. స్టాండ్‌అలోన్‌గా 13 గంటలు, మొత్తం 53 గంటల ప్లేబ్యాక్ అందిస్తాయి. 10 నిమిషాల ఫాస్ట్ ఛార్జింగ్‌తో 3 గంటల ప్లేబ్యాక్ వస్తుంది. ఇయర్‌బడ్స్ IP54 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్‌తో, కేస్ IPX2 వాటర్ రెపెలెన్సీతో ఉన్నాయి. ఇన్-ఇయర్ వేర్ డిటెక్షన్, ఇయర్‌బడ్ ఫిట్ టెస్టింగ్, లో-లేటెన్సీ గేమింగ్ మోడ్, మోటో AI, మోటోరోలా క్యూరా ఇంటిగ్రేషన్ వంటి స్మార్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

మోటో బడ్స్ 2 ఫ్యూజన్‌లో 12.4మీమీ డైనమిక్ డ్రైవర్లు ఉండగా.. మోటో బడ్స్ 2లో 11మీమీ + 6మీమీ డైనమిక్ డ్రైవర్లు, మోటో బడ్స్ 2 ప్లస్‌లో 11మీమీ డైనమిక్ + నోల్స్ బ్యాలెన్స్‌డ్ ఆర్మేచర్లు ఉన్నాయి. ఫ్యూజన్‌లో బ్యాటరీ లైఫ్ 13 గంటలు / 53 గంటలు కాగా.. బడ్స్ 2లో 11 / 48 గంటలు, ప్లస్‌లో 9 / 40 గంటలు ఉన్నాయి. మూడింటిలోనూ డైనమిక్ ANC 55dB, బ్లూటూత్ 6.0, IP54/IPX2 రేటింగ్‌లు సమానంగా ఉన్నాయి. ప్లస్ వెర్షన్‌లో సౌండ్ బై బోస్ ట్యూనింగ్, LHDC కోడెక్స్ మద్దతు ఉంది. మోటో బడ్స్ 2 ఫ్యూజన్ టాప్ షూ, లారెల్, సర్ఫ్ ది వెబ్ అనే 3 పాంటోన్-క్యూరేటెడ్ కలర్స్‌లో వస్తుంది. అధికారిక ధర వచ్చే వారం లాంచ్ సమయంలో తెలియనుంది.