ప్రస్తుతం స్మార్ట్ టీవీలు పెద్ద సైజులో అందుబాటులో ఉన్నాయి. 32 ఇంచెస్ నుంచి 98 ఇంచెస్ వరకు స్మార్ట్ టీవీలు మార్కెట్లో లభ్యమవుతాయి. టీవీని సెటప్ చేయడానికి ఇంట్లో చాలా మార్పులు చేయాల్సి ఉంటుంది. గోడలోకి డ్రిల్లింగ్ చేసి స్టాండ్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ ప్రక్రియ చాలా మందికి ఖరీదైనదిగా మాత్రమే కాకుండా సంక్లిష్టమైనది కూడా. అందుకే మార్కెట్లో ఎన్నో మినీ ప్రొజెక్టర్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రొజెక్టర్‌లు ఇంట్లో ఉపయోగించడం చాలా సులభం. ఇవి ఏ గోడనైనా స్మార్ట్ టీవీ స్క్రీన్‌గా మార్చగలవు.
మార్కెట్లో ఎన్నో రకాల కంపెనీలకు చెందిన మినీ ప్రొజెక్టర్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ ఆఫర్‌లను ఉపయోగించుకుని మినీ ప్రొజెక్టర్‌ల మరింత తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. మినీ ప్రొజెక్టర్‌ల ధర రూ.5,000 నుంచి ప్రారంభమవుతాయి. అయితే ఫీచర్లు, ఓఎస్, ఇతర మెరుగైన ఫీచర్స్ కావాలనుకుంటే ప్రొజెక్టర్ ధర ఎక్కువ కావచ్చు.
Also Read: 200MP Camera Phones: 200MP కెమెరా స్మార్ట్‌ఫోన్‌ల జాబితా.. 23 వేల నుంచే ఆరంభం!
మినీ ప్రొజెక్టర్ కొనుగోలు చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన అంశాలు తప్పక గుర్తుంచుకోవాలి. వీటిలో ఆపరేటింగ్ సిస్టమ్, యాప్ సపోర్ట్ అత్యంత ముఖ్యమైనవి. చాలా కంపెనీలు ఆండ్రాయిడ్ ఓఎస్‌తో ప్రొజెక్టర్లను లాంచ్ చేస్టున్నాయి. మినీ ప్రొజెక్టర్ కొనుగోలు చేసేటప్పుడు రిజల్యూషన్‌ను కూడా చూసుకోవాలి. 1080p రిజల్యూషన్ బాగుటుంది. అలాగే కనెక్టివిటీ పోర్ట్‌లు, HDMI పోర్ట్‌లు సహా Wi-Fi పోర్ట్‌లు ఉండేలా చూసుకోవాలి. బ్రైట్‌నెస్ కూడా చెక్ చేసుకోవాలి. మినీ ప్రొజెక్టర్‌లు సాధారణంగా ల్యూమన్‌లలో బ్రైట్‌నెస్ ప్రదర్శిస్తాయి. మీరు 1000 ల్యూమన్‌లను కొనుగోలు చేయొచ్చు.
