Microsoft 365 Personal, Copilot: కళాశాల, విశ్వవిద్యాలయ విద్యార్థులకు మైక్రోసాఫ్ట్ శుభవార్త అందించింది. విద్యార్థులు తమ విద్యా సంబంధిత ఇమెయిల్ ఐడీని ఉపయోగించి Microsoft 365 Personal ప్యాకేజీని ఒక సంవత్సరం పాటు పూర్తిగా ఉచితంగా పొందవచ్చు. ఈ ఆఫర్ ద్వారా విద్యార్థులు ఎటువంటి సబ్‌స్క్రిప్షన్ ఫీజు చెల్లించకుండా ప్రీమియం యాప్‌లు, అధునాతన Copilot ఫీచర్లకు యాక్సెస్ పొందవచ్చు. ఇది సాధారణంగా ఉచితంగా లభించే వెబ్-మాత్రమే (Web-only) వెర్షన్ కాదు. ఈ ఆఫర్ కింద లభించే Microsoft 365 Personal ప్లాన్‌లో అనేక ప్రీమియం సేవలు ఉంటాయి. అవేంటంటే.. వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, షేర్ పాయింట్, టీమ్స్ ఇంకా యాప్‌లకు పూర్తి యాక్సెస్ లభిస్తుంది.
X Chat: వాట్సాప్‌కు దీటుగా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ భద్రతతో ఎక్స్ (X) కొత్త ‘చాట్’ ఫీచర్..!
అలాగే విద్యార్థులు Copilot సైడ్‌బార్‌ను సపోర్ట్ చేసే యాప్‌లలో పొందవచ్చు. వీటితోపాటు విజన్, పాడ్ క్యాస్ట్, డీప్ రీసెర్చ్ వంటి అధునాతన ఫీచర్లు, ఇమేజ్, వీడియో జనరేషన్ టూల్స్‌కు కూడా యాక్సెస్ ఉంటుంది. అలాగే క్లౌడ్ స్టోరేజ్ విభాగంలో నోట్స్, ప్రాజెక్టులు, రీసెర్చ్ ఫైల్స్, మీడియా స్టోరేజ్ కోసం ఉపయోగపడే 1TB క్లౌడ్ స్టోరేజ్ ను ‘వన్ డ్రైవ్’, ‘అవుట్ లుక్’ ద్వారా పొందవచ్చు. వీటి అన్నిటికోసం విద్యార్థులు తమ కాలేజ్ లేదా యూనివర్సిటీ ఇమెయిల్ ఐడీని ఉపయోగించి సైనప్ పేజీలో నమోదు చేసుకోవచ్చు. అయితే నమోదు చేసుకున్న వెంటనే యాక్టివేషన్ జరగదు. సాధారణంగా 24 గంటలలోపు యాక్సెస్ లింక్ ఉన్న నిర్ధారణ ఇమెయిల్ పంపబడుతుంది. కాబట్టి విద్యార్థులు తమ యాక్సెస్ కోసం కొద్దిసేపు వేచి ఉండాల్సి ఉంటుంది.
IT Raids: హైదరాబాద్ లో ప్రముఖ హోటళ్ల చైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో ఐటీ రైడ్స్.. ఏకకాలంలో 15 చోట్ల..
ఆఫర్ పేజీలో ప్రాంతీయ పరిమితులు పెద్దగా కనిపించనప్పటికీ.. కొన్ని Copilot, Microsoft 365 ఫీచర్లు ప్రస్తుతానికి US, UK, కెనడాలోని విద్యార్థులకు మాత్రమే పరిమితం చేయబడినట్లు తెలుస్తోంది. ఈ ఉచిత ప్రీమియం యాక్సెస్ విద్యార్థులకు ఆర్థిక భారం లేకుండా పనిని మరింత సులభతరం చేస్తుంది. నెలవారీ చెల్లింపుల గురించి లేదా స్టోరేజ్ పరిమితుల గురించి ఆందోళన చెందకుండా విద్యార్థులు తమ చదువుపై దృష్టి పెట్టడానికి ఈ డీల్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
