Site icon NTV Telugu

Navi UPI: క్యూఆర్ కోడ్ టికెట్ కొనుగోలు వ్యవస్థను ప్రారంభించనున్న మెట్రో

Untitled Design (3)

Untitled Design (3)

మెట్రో ప్రయాణం పూర్తిగా డిటిజలైజ్ చేసేందుకు మెట్రో క్యూఆర్ కోడ్ టికెట్ కొనుగోలు వ్యవస్థను ప్రారంభించనుంది. అయితే.. నవీ యూపీఐ.. ఓపెన్ నెట్ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ తో కలిసి ఈ సిస్టమ్ ను ప్రవేశ పెట్టేందుకు సిద్ధంగా ఉంది. బెంగుళూరు, ముంబై, ఢిల్లీ లోని మెట్రోలో ప్రయాణించాలనుకునే వారు.. నవీ యుపిఐ యాప్‌లో టికెట్లను కొనుగోలు చేయవచ్చు. అయితే.. ఈ సౌకర్యం త్వరలో చెన్నై, హైదరాబాద్, కొచ్చి నగరాల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు మెట్రో నిర్వాహాకులు.

Read Also: Health Benefits of Garlic: రోజు రెండు ఎల్లిపాయ రెబ్బలు తింటే.. ఏమవుతుందో తెలుసా..

మెట్రోలో ప్రయాణించే వారు క్యూఆర్ కోడ్ తో టికెట్లు బుక్ చేసుకోవడానికి .. వేర్వేరు ఫ్లాట్ ఫాంలను ఉపయోగించే అవసరం లేదని.. మెట్రో నిర్వాహాకులు తెలిపారు. అయితే.. ఇవన్ని నవి యూపీఐ అనే యాప్ ద్వారా.. బుక్ చేసుకోవచ్చని తెలిపింది. క్యూలైన్ లో వేచి ఉండకుండా.. వేరే యాప్ లను ఉపయోగించకుండా.. పూర్తిగా.. డిటిజలైజేషన్ కోసమే.. ఈ వ్యవస్థను ప్రారంభించామని.. యాప్ మేనెజ్మెంట్ వెల్లడించింది.

Read Also:Dogs On Patient Beds: ఆసుపత్రి బెడ్లపై నిద్రిస్తున్న కుక్కలు.. పట్టించుకోని సిబ్బంది..

ఇండియాలో కోట్లాటి మందిని మెట్రో తమ గమ్య స్థానాలకు తీసుకెళుతుందని.. నవీ లిమిటెడ్ ఎండీ, సీఈఓ రాజీవ్ నరేష్ తెలిపారు. పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు ఇప్పటికీ టిక్కెట్ల కోసం క్యూలలో నిలబడుతున్నారని.. దీంతో వారి ప్రయాణం ఆలస్యం అవుతుందన్నారు. అయితే.. దీన్ని నివారించేందుకు ఓఎన్డీసీతో కలిసి..వన్ యాప్, వన్ QR టికెట్, వన్ సీమ్‌లెస్ ట్యాప్ ద్వారా.. మెట్రో ప్రయాణాన్ని.. డిజిటల్ వ్యవస్థగా మార్చామని ఆయన చెప్పుకొచ్చారు. ప్రతి ప్రయాణికుడి ప్రయాణాన్ని వేగవంతం, సులభతరం చేయడమే.. తమ లక్ష్యమని రాజీవ్ నరేష్ అన్నారు.

Exit mobile version