Meta Report: పేరెంట్స్‌కు బిగ్ అలర్ట్! ఇన్‌స్టాలో టీనేజర్స్ ఆ కంటెంట్‌నే చూస్తున్నారట.. బాంబు పేల్చిన మెటా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meta Report: పిల్లలకు ఫోన్లూ, డిజటల్ పరికరాలే ప్రపంచమవుతున్నాయి. దాంతో వాళ్లలో మానసిక సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఫోన్లు భద్రతదృష్ట్యా మంచివి కాదని చెబుతున్నారు. డిజిటల్ ప్రపంచంలో పిల్లలు ఏం చేస్తున్నారో గమనించాలని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో టీనేజర్స్ ఎక్కువగా ఇష్టపడుతున్న కంటెంట్‌పై తాజాగా మెటా బాంబు పేల్చింది. మెటా ప్రకటనతో ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. టీనేజర్ల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లలో గడుపుతున్న విషయం పెద్దగా చెప్పనవసరం లేదు.
READ MORE: AI Summit: ఢిల్లీ ఏఐ సమ్మిట్‌లో న్యూసెన్స్ సృష్టించిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరెస్ట్
Also Read
- Alibaba AI: మెటా, గూగుల్‌ను వెనక్కి నెట్టి.. మూడు బిలియన్ డౌన్లోడ్లు దాటిన అలీబాబా ఏఐ మోడల్స్..
- Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
- 48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్‌లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
- iQOO Smartphone: భారీగా పెరిగిన iQOO స్మార్ట్ఫోన్ల ధరలు.. iQOO 15, 15R, Neo 10 కొత్త ధరలు ఇవే!
రాయిటర్స్ నివేదికల ప్రకారం.. కాలిఫోర్నియా కోర్టులో మెటా ఇచ్చిన సమాచారంలో ఓ షాకింగ్ అంశం బయటపడింది. 13 నుంచి 15 సంవత్సరాల మధ్య వయసున్న టీనేజర్లలో ఐదుగురిలో ఒకరు ఇన్‌స్టాగ్రామ్ (Instagram)లో అశ్లీల చిత్రాలను చూస్తున్నారని చెప్పింది. ఇది యాదృచ్ఛికంగా జరుగుతున్నదా, లేక అల్గోరిథమ్ వల్లనా అనే అంశంపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అంతే కాదు.. కొత్త యూజర్లను పెంచుకోవాలంటే టీనేజర్లపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని మెటా అంతర్గత పరిశోధకులు కంపెనీకి మరో ముఖ్యమైన సూచన ఇచ్చారట. ఎందుకంటే ఇంట్లో ఏ స్మార్ట్‌ఫోన్‌లో ఏ యాప్ ఉండాలి అన్న నిర్ణయాన్ని చాలాసార్లు టీనేజర్స్ ప్రభావితం చేస్తారట. అంటే ఒక టీనేజర్‌ను ఆకట్టుకుంటే.. అతడి కుటుంబం మొత్తం మన యాప్స్ వాడే అవకాశం ఉందని మెటా పరిశోధకులు అంచనా వేశారట. ఈ నిర్ణయం అత్యధిక శాతం వర్కౌట్ అయ్యింది.
READ MORE: Milk Adulteration: పాలు కల్తీ చేస్తే మరణశిక్ష.. ఫుడ్ సేఫ్టీ అధికారుల స్ట్రాంగ్ వార్నింగ్
ఇదే సమయంలో మరో ఆందోళనకర విషయం కూడా బయటపడుతోంది. ఈ ప్లాట్‌ఫార్మ్‌లు టీనేజర్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని పలుమార్లు ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా అమెరికాలో మెటాపై నడుస్తున్న కేసుల్లో కంపెనీ మైనర్ల మనస్తత్వాన్ని ఉపయోగించుకుని వారిని ఎక్కువసేపు యాప్‌లలో ఉండేలా చేసే విధంగా ఫీచర్లు రూపొందించిందని ఆరోపణలు వస్తున్నాయి. అడిక్షన్‌లా మారేలా నోటిఫికేషన్లు, రీల్స్, సజెషన్లు డిజైన్ చేస్తున్నారనే విమర్శలూ ఉన్నాయి. ఇప్పటికే.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న WhatsApp, Facebook, ఇన్‌స్టాగ్రామ్ వంటి యాప్‌లు మెటాకు చెందినవే. ఇవి పెద్దలతో పాటు టీనేజర్స్ కమ్యూనికేషన్ విధానాన్ని పూర్తిగా మార్చేశాయి. అందుకే ఈ అంశంపై వచ్చిన ప్రతి కొత్త సమాచారం టెక్ ప్రపంచానికే కాదు.. తల్లిదండ్రులు, టీచర్లు, పాలసీ మేకర్లకూ కీలకంగా మారుతోంది. అందుకే మీ పిల్లలను ఓ కంట గమనిస్తూ ఉండటం మంచిది. వారు ఎలాంటి యాప్స్ వాడుతున్నారు? ఎంత సమయం వరకు ఫోన్ యూజ్ చేస్తున్నారనే అంశాన్ని గమనిస్తూ వారికి భయం పెట్టాల్సిన బాధ్యత పేరెంట్స్‌దే. లేకపోతే చేయి జారే ప్రమాదం పుష్కలంగా ఉంది.
తాజావార్తలు
-
Harish Rao : రేవంత్‌కు హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్.. ‘నిరూపిస్తే రాజీనామా.!’
-
Tamil Nadu: ‘‘తండ్రి ఎవరో తల్లిని అడగాలి’’.. విజయ్ వ్యాఖ్యలకు బీజేపీ చీఫ్ షాకింగ్ కౌంటర్
-
Door Mat Cleaning: డోర్ మ్యాట్ ఎంత ఉతికినా మురికిగానే ఉంటుందా.. ఈ చిట్కాతో మురికి మాయం..
-
Cleaning Tips: బాత్రూమ్లో వాడే ప్లాస్టిక్ డబ్బాకు మరకలు పోవడం లేదా..? ఈ చిన్న చిట్కాతో మెరిసిపోతుంది..
-
CM Revanth Reddy : జగ్గారెడ్డి లాంటి నాయకుడు వెయ్యి కోట్లు ఇచ్చినా దొరకడు
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!