Site icon NTV Telugu

Magnus Carlsen: మరోసారి భారత గ్రాండ్‌మాస్టర్ చేతిలో ఓడిన మాగ్నస్ కార్ల్సెన్.. ఆగ్రహాన్ని అదుపులో పెట్టుకోలేక..?

Magnus Carlsen

Magnus Carlsen

Magnus Carlsen: ప్రస్తుత ప్రపంచ చెస్‌లో ‘ది వన్ అండ్ ఓన్లీ’గా గుర్తింపు పొందిన నార్వే గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్ కార్ల్సెన్ మరోసారి తన ఆగ్రహాన్ని అదుపులో పెట్టుకోలేకపోయాడు. తాజాగా దోహాలో జరుగుతున్న ఫిడే వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్ లో భారత యువ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఎరిగైసి చేతిలో అనూహ్యంగా ఓడిపోయిన తర్వాత కార్ల్సెన్ టేబుల్‌పై బలంగా గుద్దుతూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు దీనిని ‘కార్ల్సెన్ అవుట్‌బర్స్ట్ 2.0’గా కామెంట్స్ చేస్తున్నారు.

New Year Liquor Sale: మద్యం ప్రియులకు పండగే.. రేపు ఉదయం 6 గంటల నుంచే మద్యం విక్రయాలకు అనుమతి..!

ఇదివరకే జూన్‌లో జరిగిన నార్వే చెస్ టోర్నమెంట్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ గుకేష్ చేతిలో ఓడిన అనంతరం కూడా కార్ల్సెన్ తన అసహనాన్ని బహిరంగంగా చూపించాడు. ఇప్పుడు మరోసారి అదే తరహా ప్రవర్తనతో వార్తల్లో నిలిచాడు. ప్రస్తుత ఫిడే వరల్డ్ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లో అర్జున్ ఎరిగైసి అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. 11 రౌండ్లు పూర్తయ్యే సరికి 9 పాయింట్లతో ఫ్రాన్స్ గ్రాండ్‌మాస్టర్ మాక్సిమ్ వాచియర్-లాగ్రావ్‌తో కలిసి సంయుక్త అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో ఎరిగైసి వరుసగా ప్రపంచ ఛాంపియన్ కార్ల్సెన్‌తో పాటు, మరో స్టార్ ప్లేయర్ ఉజ్బెక్ గ్రాండ్‌మాస్టర్ నొదిర్‌బెక్ అబ్దుసత్తోరోవ్ ను ఓడించి ముందంజలో ఉన్నారు.

Snapdragon 7 Gen 4 చిప్, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీ వంటి ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో లాంచ్ కు సిద్దమైన Realme 16 Pro+ 5G..!

కార్ల్సెన్‌పై తొమ్మిదవ రౌండ్‌లో అద్భుతమైన ఎండ్‌గేమ్ టెక్నిక్‌తో విజయం సాధించాడు. అనంతరం 10వ రౌండ్‌లో అబ్దుసత్తోరోవ్‌ను ఓడించి అగ్రస్థానంలో 0.5 పాయింట్ ఆధిక్యాన్ని సంపాదించాడు. ప్రస్తుతం వరల్డ్ నంబర్ వన్‌గా ఉన్న కార్ల్సెన్, ఆదివారం గెలుచుకున్న వరల్డ్ రాపిడ్ టైటిల్‌తో పాటు తన తొమ్మిదవ వరల్డ్ బ్లిట్జ్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగాడు. ఈరోజు ఇంకా రెండు రౌండ్లు మిగిలి ఉండటంతో తిరిగి పోటీలోకి వచ్చే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఎరిగైసి చేతిలో ఓటమి మాత్రం అతడిని తీవ్రంగా కుదిపేసింది.

Exit mobile version