Site icon NTV Telugu

LG 5K Monitor: టీవీని మించిన ‘మినీ’ విజువల్.. 5K మెరుపులతో LG మానిటర్ వస్తుంది!

Lg 5k Monitor

Lg 5k Monitor

LG 5K Monitor: LG గేమింగ్ మానిటర్ విభాగంలో ఒక పెద్ద సంచలనాన్ని సృష్టించింది. ప్రపంచంలో మొట్టమొదటి 5K మానిటర్ రాబోతుంది. ఈ కంపెనీ అల్ట్రాగేర్ ఈవో సిరీస్ కింద మూడు కొత్త 5K గేమింగ్ మానిటర్లను పరిచయం చేసింది. వీటిలో ప్రపంచంలోనే మొట్టమొదటి 5K మినీ LED మానిటర్ 32-అంగుళాలు, 43-అంగుళాల టీవీ కంటే పెద్దదిగా ఉండే భారీ 52-అంగుళాల మానిటర్లు ఉన్నాయి. ఇంకా వాటి ధరలను LG వెల్లడించలేదు. జనవరిలో ప్రారంభమయ్యే CES 2026 ఈవెంట్‌లో వీటిని ఆవిష్కరించనున్నట్లు సమాచారం. వీటి ప్రత్యేకతలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Fire Accident : హైదరాబాద్‌ సోమాజిగూడలో భారీ అగ్నిప్రమాదం

అల్ట్రాగేర్ GX9 39GX950B ప్రత్యేకతలు ఇవే..
LG UltraGear GX9 సిరీస్ 39-అంగుళాల మోడల్. కంపెనీ దీనిని Tandem WOLED ప్యానెల్‌తో తీసుకువస్తుంది. ఈ మానిటర్ 21:9 అల్ట్రా-వైడ్ యాస్పెక్ట్ రేషియో, 5120 x 2160 యొక్క 5K రిజల్యూషన్‌ను కలిగి ఉంది. ఇది డ్యూయల్ మోడ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. వినియోగదారులు 165Hz రిఫ్రెష్ రేట్, WFHD మోడ్ మధ్య మారడానికి కూడా అనుమతిస్తుంది. ఈ మానిటర్ ప్రొఫెషనల్ గేమర్స్, హై-ఎండ్ కంటెంట్ యూజర్స్‌ను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు.

ప్రపంచంలోనే మొట్టమొదటి 5K మినీ LED మానిటర్ GM9..
LG యొక్క 27-అంగుళాల అల్ట్రాగేర్ GM9 ప్రపంచంలోనే మొట్టమొదటి 5K మినీ LED మానిటర్. సాధారణంగా యూజర్స్‌ను ఈ మినీ LED ప్యానెల్లు బ్లూమింగ్ లేదా హాలో ఎఫెక్ట్‌తో బాధపడుతుంటాయి. కానీ LG పరిచయం చేసిన ఈ మానిటర్లలో మెరుగైన బ్లూమ్ కంట్రోల్ టెక్నాలజీని ఉపయోగించినట్లు పేర్కొంది. ఈ మానిటర్ VESA DisplayHDR సర్టిఫికేషన్‌తో వస్తుంది. అలాగే ఇది 1250 nits లైటింగ్‌ కలిగి ఉంటుంది. డ్యూయల్ మోడ్ 165Hz, 330Hz మధ్య మారడానికి ఫర్మిషన్ ఇస్తుంది.

LG సంస్థ UltraGear G9 అనే పెద్ద 52-అంగుళాల గేమింగ్ మానిటర్‌ను కూడా ప్రవేశపెట్టింది. దీని పరిమాణం పెద్ద స్మార్ట్ టీవీ కన్నా పెద్దదిగా ఉంటుందని, అలాగే ఇది 5K రిజల్యూషన్‌కు కూడా మద్దతు ఇస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కంపెనీ నివేదికల ప్రకారం.. ఈ మానిటర్ ప్రామాణిక అల్ట్రా HD మానిటర్ కంటే దాదాపు 33 శాతం వెడల్పుగా ఉంటుంది. ఇది స్థిరమైన 240Hz రిఫ్రెష్ రేటుతో పనిచేస్తుంది, గేమింగ్, మల్టీ టాస్కింగ్ రెండింటికీ సపోర్ట్ చేస్తుంది. ఈ బహుళ మానిటర్ల అవసరాన్ని తొలగిస్తుందని LG చెబుతోంది.

ఈ మూడు కొత్త గేమింగ్ మానిటర్ల ధరలను LG ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. CES 2026లో ధర, ఇవి ఎక్కడ దొరుకుతాయి అనే సమాచారాన్ని కంపెనీ చెబుతుందని టెక్ ప్రపంచం అభిప్రాయపడుతుంది. UltraGear evo సిరీస్‌లో భాగమైన ఈ మానిటర్లు ప్రీమియం గేమింగ్ సెక్షన్‌ను టార్గెట్‌గా మార్కెట్‌లోకి రాయల్ ఎంట్రీ ఇవ్వబోతుందని సమాచారం.

READ ALSO: TFCC: ఫిలిం ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా డి.సురేష్ బాబు..

Exit mobile version