NTV Telugu Site icon

Lenovo IdeaPad Slim 5: AI ఫీచర్లతో లెనోవా కొత్త ల్యాప్ టాప్.. ధర ఎంతంటే?

Laptap

Laptap

ల్యాప్‌టాప్‌లు వ్యక్తిగత అవసరాలు, విద్య, ఉద్యోగం, గేమింగ్‌ కోసం చాలా మంది యూజ్ చేస్తున్నారు. యూజర్లను దృష్టిలో పెట్టుకుని అడ్వాన్స్డ్ ఫీచర్లతో ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీలు కొత్త ల్యాప్ టాప్ లను తీసుకొస్తున్నాయి. తాజాగా లెనోవో కంపెనీ వినియోగదారుల కోసం కొత్త ల్యాప్ టాప్ ను తీసుకొచ్చింది. లెనోవో భారత మార్కెట్ లో ప్రొఫెషనల్స్, డెవలపర్స్, కంటెంట్ క్రియేటర్స్‌ కోసం లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 5 జెన్ 10 AI ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 5 స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్, డెవలపర్స్, కంటెంట్ క్రియేటర్స్‌కు ఉత్తమమైన ల్యాప్‌టాప్ అని కంపెనీ వెల్లడించింది.

Also Read:CP Sudheer Babu : పసి బిడ్డలను అమ్ముకుంటున్న ముఠా అరెస్ట్

ఈ ల్యాప్‌టాప్ రెండు సైజుల్లో.. 14 అంగుళాలు, 16 అంగుళాలలో లభిస్తుంది. ఇది AI ఫీచర్ల కోసం AMD రైజెన్ AI 300 సిరీస్ ప్రాసెసర్, జెన్ 5 కోర్, RDNA 3.5 గ్రాఫిక్స్, XDNA 2 NPU లను కలిగి ఉంది. లెనోవా ఐడియాప్యాడ్ స్లిమ్ 5 ప్రారంభ ధర రూ .91,990గా కంపెనీ నిర్ణయించింది. ఈ ల్యాప్‌టాప్ లూనా గ్రే, కాస్మిక్ బ్లూ రంగులలో వస్తుంది. ఇది Lenovo.com, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు, ఆఫ్‌లైన్ రిటైలర్లలో లభిస్తుంది.

Also Read:L2E EMPURAAN: ‘L2E ఎంపురాన్’లో గేమ్ ఆఫ్ థ్రోన్స్ జెరోమ్ ఫ్లిన్.. అదిరిందిగా!

లెనోవా ఐడియాప్యాడ్ స్లిమ్ 5 స్పెసిఫికేషన్లు

Lenovo IdeaPad Slim 5 120Hz రిఫ్రెష్ రేట్‌తో 14-అంగుళాల WUXGA OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 16-అంగుళాల వేరియంట్ IPS లేదా 2.8K OLED ఎంపికలతో పాటు టచ్, నాన్-టచ్ లతో వస్తుంది. రెండు మోడళ్లు యాంటీ-గ్లేర్ స్క్రీన్‌ను కలిగి ఉంటాయి. ఈ ల్యాప్‌టాప్ రైజెన్ AI 7 350 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 32GB DDR5 RAM, 1TB M.2 SSD స్టోరేజ్ ను కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్ విండోస్ 11లో పనిచేస్తుంది.

Also Read:Maha Shivaratri 2025: ప్రపంచంలోనే ఎత్తైన రుద్రాక్ష శివలింగం.. 36 లక్షల రుద్రాక్షలతో.. 36 అడుగుల శివలింగం

ఐడియాప్యాడ్ స్లిమ్ 5 లో 1080p FHD IR హైబ్రిడ్ కెమెరా, బ్యాక్‌లిట్ కీబోర్డ్, 60Wh బ్యాటరీ ఉన్నాయి. కనెక్టివిటీ కోసం Wi-Fi 7, బ్లూటూత్ 5.4, రెండు USB-C పోర్ట్‌లు, రెండు USB-A పోర్ట్‌లు, HDMI 2.1, హెడ్‌ఫోన్/మైక్ కాంబో ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్ 16.9mm మందం కలిగి ఉంటుంది. మిలిటరీ-గ్రేడ్ క్వాలిటీతో వస్తుంది.