Lenovo Dual Screen Laptop:లెనోవా నుంచి అదిరిపోయే ల్యాప్ టాప్..రెండు పనులు ఒకేసారి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ ఎలెక్ట్రానిక్ కంపెనీ లెనోవా నుంచి ల్యాప్ టాప్ లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. ఈ క్రమంలో మరో ల్యాప్ టాప్ ను మార్కెట్ లోకి తీసుకొని వచ్చారు..పేరు లెనోవో యోగా బుక్ 9ఐ. దీనిలో ప్రత్యేకత ఏంటంటే డ్యూయల్ స్క్రీన్..13వ జెన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్ ఉంటుంది. 13.3 అంగుళాల ఓఎల్ఈడీ టచ్ డిస్ ప్లే 2.8కే రిజల్యూషన్ తో ఉంటుంది. ఇది ఇంటెల్ ఈవో ప్లాట్‌ఫారమ్ ఆధారంగా పనిచేస్తుంది. డాల్బీ అట్మోస్ టెక్నాలజీతో కూడిన క్వాడ్ స్పీకర్‌లను కలిగి ఉంటుంది. ఇది వైఫై 6ఈ, థండర్‌బోల్ట్ 4తో సహా తాజా కనెక్టివిటీ ఎంపికలను కలిగి ఉంది. ఫోలియో స్టాండ్, వేరు చేయగల బ్లూటూత్ కీబోర్డ్ వంటి విభిన్న ఉపకరణాలతో వస్తుంది. యోగా బుక్ 9ఐ నాలుగు-సెల్స్ కలిగిన 80Whr బ్యాటరీతో పనిచేస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం..
ఇండియాలో ఈ ల్యాప్ టాప్ ప్రారంభ ధర రూ. 2,24,999గా ఉంది. ల్యాప్‌టాప్ టైడల్ టీల్ షేడ్‌లో వస్తుంది. ప్రస్తుతం కంపెనీ వెబ్‌సైట్ ద్వారా ప్రీ-బుకింగ్ లను ఆహ్వానిస్తోంది. పలు ఎంపిక చేసిన క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చేసే కొనుగోలు చేస్తే రూ. 10,000 క్యాష్‌బ్యాక్ ను లెనోవో అందిస్తోంది..పాత ల్యాప్ టాప్ లను ఎక్స్ చేంజ్ చేయడం ద్వారా మరో రూ. 10,000 బోనస్ ను పొందొచ్చు. వాస్తవానికి ఈ ల్యాప్ టాప్ సీఈఎస్ 2023లోనే ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ అయ్యింది.. ఒరిజినల్ ధర వచ్చేసి రూ.1,75,000గా ఉంటుంది.
Also Read
- Lenovo ThinkBook 14x: లెనోవా ThinkBook 14x వచ్చేసింది.. 120Hz OLED డిస్‌ప్లే, Core Ultra ప్రాసెసర్
- Starlink India Row: ‘మార్కెట్ గుత్తాధిపత్యం కోసమే అడ్డుకుంటున్నారు’.. Starlink Indiaపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
- Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
- IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
ఈ ల్యాప్ ఫీచర్స్ విషయానికొస్తే..ఈ ఫోల్డబుల్ స్క్రీన్ మల్టీ టాస్కింగ్ కు బాగా ఉపకరిస్తుంది. ఈ ల్యాప్‌టాప్ విండోస్ 11పై నడుస్తుంది. 60హెర్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్ డీఆర్ సర్టిఫికేషన్, డాల్బీ విజన్ సపోర్ట్‌తో రెండు 13.3-అంగుళాల 2.8కే ఓఎల్ఈడీ ప్యూర్‌సైట్ డిస్‌ప్లేలను కలిగి ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్‌ను టాబ్లెట్ మోడ్‌లో కూడా వినియోగించుకోవచ్చు..ఇది 13వ ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్ తో పాటు ఇంటిగ్రేటెడ్ ఇంటెల్ ఐరిస్ ఎక్స్ఈ గ్రాఫిక్స్‌తో రన్ అవుతుంది. ఇది 16జీబీ ర్యామ్ ని కలిగి ఉంటుంది. 1టీబీ వరకూ స్టోరేజ్ సామర్థ్యం ఉంటుంది..ల్యాప్‌టాప్ థండర్ బోల్ట్ 4తో మూడు యూఎస్బీ టైప్-సి పోర్ట్‌లను కలిగి ఉంది. బ్లూటూత్ 5.2 , వైఫఐ 6ఈ కనెక్టివిటీ అందిస్తుంది..ఇది ఒక ఛార్జ్‌పై డ్యూయల్ స్క్రీన్ వినియోగంతో గరిష్టంగా 10 గంటలు పనిచేస్తుంది. అలాగే 14 గంటలు ప్లే బ్యాక్ ఉంటుంది..
తాజావార్తలు
-
Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా క్యాన్సిల్?
-
Ola Electric Rights Issue: ఓలా ఎలక్ట్రిక్ రైట్స్ ఇష్యూ.. రూ.27కే షేర్లు.. రికార్డ్ డేట్, ప్రారంభ తేదీ వివరాలు ఇవే
-
UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
ట్రెండింగ్
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!