NTV Telugu Site icon

Lava: వెరీ చీప్.. స్మార్ట్‌వాచ్, ఇయర్‌బడ్స్‌ కేవలం రూ. 26లకే..

Lava

Lava

ఆఫర్లు ఉంటాయి కానీ, మరీ ఇంతలా ఆశ్చర్యపోయేలా ఉంటాయా అని అనుకుంటారు కావొచ్చు ఇది తెలిస్తే. నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజమేనండి బాబు. రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా దేశీయ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ లావా పిచ్చెక్కించే ఆఫర్ ను ప్రకటించింది. స్మార్ట్ వాచ్, ఇయర్ బడ్స్ ను కేవలం రూ. 26కే అందించనున్నట్లు ప్రకటించింది. కస్టమర్లను ఆకర్షించేందుకు, సేల్ ను పెంచుకునేందుకు లావా కంపెనీ ఆఫర్ల వర్షం కురిపించింది. మరి ఈ ఆఫర్ ఎప్పుడు ప్రారంభం కానున్నది? ఎప్పటి వరకు ఉండనున్నది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

లావా కంపెనీ Prowatch ZN స్మార్ట్‌వాచ్, Probuds T24 ఇయర్‌బడ్స్‌పై స్పెషల్ ఆఫర్లు ప్రకటించింది. ProWatch ZN, Probuds T24 ధర వరుసగా రూ. 2599 మరియు రూ. 1299గా ఉంది. ఆఫర్లో భాగంగా ఈ రెండు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ధర రూ. 26కే అందించనున్నది. అయితే ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాగా ఈ ఛాన్స్ మొదటి వంద మందికి మాత్రమే అందించనున్నది. ఈ ఆఫర్ జనవరి 26, 2025 మధ్యాహ్నం 12 గంటలకు Lava e-storeలో ప్రారంభమవుతుంది. Lava e-storeలో Prowatch ZN స్మార్ట్‌వాచ్‌ని కొనుగోలు చేయడానికి కస్టమర్‌లు Prowatch కూపన్ కోడ్‌ ఉపయోగించాలి. అలాగే, Probuds T24 కొనుగోలుదారులు Probuds కూపన్ కోడ్‌ ఉపయోగించాలి.