Lava Shark 2: దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా (Lava) తన తదుపరి షార్క్ (Shark) సిరీస్ ఫోన్‌ను త్వరలో భారత మార్కెట్‌లో విడుదల చేయబోతోంది. కంపెనీ అధికారికంగా ఈ సమాచారాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. తాజా టీజర్ ద్వారా ఈ ఫోన్ పేరు Lava Shark 2 అని తేల్చేశారు. ఈ ఫోన్ ప్రధానంగా కెమెరా పనితీరుపై, కొత్త డిజైన్‌పై దృష్టి సారించబోతోందని కంపెనీ తెలిపింది. లావా విడుదల చేసిన టీజర్ ప్రకారం Lava Shark 2 లో 50 మెగాపిక్సెల్ AI ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది. ఈ కెమెరా ఐలాండ్ డిజైన్ iPhone 16 Pro Max లేఅవుట్‌లా ఉంటుంది. మాడ్యూల్‌లో 50MP AI Camera బ్రాండింగ్‌తో పాటు LED ఫ్లాష్ కూడా ఉంటుంది. దీని ద్వారా ఫోటోగ్రఫీ అనుభవం మరింత ప్రీమియంగా ఉండనుంది.
Heavy Rains Today: రానున్న మూడు గంటల్లో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక!
Lava Shark 2 ఇది వరకు షార్క్ 5G యొక్క డిజైన్ లాంగ్వేజ్‌ను కొనసాగిస్తూనే కొంత నూతనతను తీసుకువస్తోంది. ఫోన్ ముందు భాగంలో వాటర్‌డ్రాప్ స్టైల్ నాచ్ సెల్ఫీ కెమెరా కోసం ఉంటుంది. వెనుక భాగం స్మూత్, కర్వ్‌డ్ ఎడ్జ్‌లతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. పవర్, వాల్యూమ్ బటన్‌లు ఫోన్ కుడి వైపున ఏర్పాటు చేశారు. ఇక కింద భాగంలో USB Type-C పోర్ట్, 3.5mm ఆడియో జాక్, స్పీకర్ గ్రిల్ మరియు మైక్రోఫోన్ ఉన్నాయి. కంపెనీ ఈ ఫోన్‌ను బ్లూ (Blue), సిల్వర్ (Silver) రంగుల్లో లాంచ్ చేయనుంది. ఈ రెండు వేరియంట్లలో మెటాలిక్ ఫినిష్ ఫ్రేమ్ ఉంటుంది. ఇది ఫోన్‌కు ప్రీమియం లుక్ ఇస్తుంది.
Dog Attacks: కుక్కలపై నాటకం.. ఎగబడి కరిచిన కుక్క
Lava ఇంకా Shark 2 యొక్క పూర్తి స్పెసిఫికేషన్లను ప్రకటించలేదు. అయితే ఇది గత మోడల్ Lava Shark 5G కంటే కొంచెం మెరుగైన హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్స్‌తో వస్తుందని అంచనా. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. బ్యాటరీ విషయానికి వస్తే, పూర్వ మోడల్‌లో 5,000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ ఉండగా, Shark 2లో కూడా ఇదే రేంజ్ లేదా కొంచెం మెరుగైన బ్యాటరీ కెపాసిటీ ఉండే అవకాశం ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ 5.0, GPS, USB టైపు-C పోర్ట్ ఉండే అవకాశం ఉంది. కంపెనీ ఇంకా అధికారిక లాంచ్ తేదీని ప్రకటించలేదు, కానీ టీజర్ ప్రకారం Lava Shark 2 త్వరలో భారత్‌లో విడుదల కానుంది.
Design that slays norms.
Clarity that kills the noise.#Shark2 #LavaMobiles #ComingSoon pic.twitter.com/nvqkjMiwg3— Lava Mobiles (@LavaMobile) October 6, 2025
