Site icon NTV Telugu

జీరో బ్లోట్‌వేర్, మెటల్ ఫ్రేమ్, డ్యూయల్ కెమెరాలతో రాబోతున్న Lava Agni: Fire for More..!

Lava Agni

Lava Agni

Lava Agni: Fire for More: లావా (Lava) సంస్థ అగ్ని (Agni) సిరీస్‌లోని Agni 4 స్మార్ట్ ఫోన్ ను నవంబర్ 20వ తేదీన విడుదల చేయనున్నట్లు ధృవీకరించింది. ఇది గత సంవత్సరం విడుదలైన Agni 3 కి అప్డేటెడ్ గా రానుంది. ఈ కొత్త మొబైల్ డిజైన్, ఫీచర్ల వెనుక ఉన్న ఆంతర్యాన్ని కంపెనీ ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. అదే.. “అగ్ని: ఫైర్ ఫర్ మోర్” (Agni: Fire for More). ఈ నినాదం కేవలం ఒక స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయడం కాకుండా.. భారతీయ సాంకేతిక పరిజ్ఞానానికి కొత్త దిశానిర్దేశం చేసే వ్యూహాత్మక దృష్టిని ప్రతిబింబిస్తుంది. Agni సిరీస్‌ను కేవలం స్మార్ట్ ఫోన్ గా మాత్రమే కాకుండా భారతీయ సాంకేతిక రంగాన్ని నడిపించే విధంగా నిలబెట్టాలని లావా ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది.

Koti Deepotsavam 2025: కైలాసాన్ని తలపిస్తున్న వేదిక.. నేడు విశేష కార్యక్రమాలు ఇవే..

Agni 4 ఇప్పటికే స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ఉన్న ప్రమాణాలను సవాలు చేసే లక్ష్యంతో అనేక ముఖ్యమైన ఫీచర్లను అందిస్తోంది. వీటిలో మెటల్ ఫ్రేమ్ ప్రధానమైనది. విడుదల చేసిన ఫోటోల ప్రకారం.. ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరాలు, డ్యూయల్ LED ఫ్లాష్, కెమెరాల చుట్టూ LED లైట్లను కలిగి ఉంది. అలాగే ఫోన్ సైడ్ ప్రొఫైల్‌లో దిగువ కుడి వైపున ఒక ప్రత్యేక బటన్ కూడా కనిపిస్తోంది. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే, Agni 3 లో Dimensity 7300X ప్రాసెసర్‌ను ఉపయోగించగా.. Agni 4 లో కూడా Dimensity ప్రాసెసర్‌నే ఉపయోగిస్తున్నట్లు కంపెనీ ధృవీకరించింది. అలాగే ఈ ఫోన్ గ్లాస్ బ్యాక్ కలిగి ఉండే అవకాశం ఉంది.

రెట్రో లుక్‌లో ‘క్లాసిక్ ఎడిషన్’.. Capri 52, Pontiac 34 మోడల్స్ తో బ్లూటూత్ స్పీకర్లు లాంచ్ చేసిన Unix India..!

అలాగే లావా బ్రాండ్ సాఫ్ట్‌వేర్,సేవ ద్వారా మెరుగైన వినియోగదారు అనుభవాన్ని అందించడానికి ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో జీరో బ్లోట్‌వేర్ (ఎలాంటి అనవసరమైన యాప్‌లు లేకుండా శుభ్రమైన ఆపరేటింగ్ సిస్టమ్) ఉంటుందని కంపెనీ హామీ ఇచ్చింది. కస్టమర్ అనుభవానికి ఉచిత హోమ్ రీప్లేస్‌మెంట్ (Free Home Replacement) ఫీచర్‌ను లావా అందిస్తోంది. ఇది కొనుగోలు తర్వాత కస్టమర్స్ కు మద్దతును, కస్టమర్ నమ్మకానికి కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేయడానికి దోహదపడుతుంది.

Exit mobile version