Kodak QLED Smart TV: కోడాక్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ రిలీజ్.. Google TV 5.0తో థియేటర్ ఫీల్!

  • కోడాక్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ
  • దీని ప్రారంభ ధర రూ.10,999
  • గూగుల్ టీవీ 5.0 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది
Kodak Qled Smart Tv

Kodak Qled Smart Tv

కోడాక్ భారతదేశంలో సరసమైన ధరలలో QLED స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. కోడాక్ నుండి వచ్చిన ఈ కొత్త ఆండ్రాయిడ్ టీవీ సిరీస్ 32 అంగుళాలు, 40 అంగుళాలు,43 అంగుళాల అనే మూడు స్క్రీన్ సైజులలో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.10,999. ఈ కొత్త కోడాక్ స్మార్ట్ టీవీ సిరీస్ ఆండ్రాయిడ్ టీవీ ప్లాట్‌ఫామ్‌పై పనిచేస్తుంది. ఇది QLED ప్యానెల్‌ను కలిగి ఉంది. అదిరిపోయే విజువల్స్, అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది.

ధర ఎంత?

కోడాక్ ‘మ్యాట్రిక్స్ క్యూఎల్‌ఈడీ’ అనే స్మార్ట్ టీవీ సిరీస్‌ను పరిచయం చేసింది. దీనిని ఫ్లిప్‌కార్ట్ అనే ఈ-కామర్స్ వెబ్‌సైట్ నుండి కొనుగోలు చేయవచ్చు. ఈ అమెరికన్ కంపెనీ స్మార్ట్ టీవీ సిరీస్ ధర రూ.10,999 నుండి ప్రారంభమవుతుంది. దీని 40-అంగుళాల మోడల్ ధర రూ.15,999 కాగా, 43-అంగుళాల మోడల్‌ను రూ.16,999కు కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు, ఈ స్మార్ట్ టీవీని కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుండి కూడా కొనుగోలు చేయవచ్చు.

కోడాక్ మ్యాట్రిక్స్ స్మార్ట్ టీవీ ఫీచర్లు

భారతదేశంలో విడుదలైన ఈ స్మార్ట్ టీవీ సిరీస్, గూగుల్ టీవీ 5.0 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఇందులో క్యూఎల్‌ఈడీ ప్యానెల్ ఉంది. ఇది శక్తివంతమైన 40W సౌండ్‌ను అందిస్తుంది. అదనంగా, ఈ సిరీస్‌లోని అన్ని మోడళ్లు స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లతో వస్తాయి. క్యూఎల్‌ఈడీ ప్యానెల్ మెరుగైన ప్రకాశాన్ని, సహజమైన రంగులను అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ సిరీస్‌లోని అన్ని మోడళ్లలో 40W స్పీకర్లు అందించారు.

ఈ స్మార్ట్ టీవీ సిరీస్‌లో ARM కార్టెక్స్ A55 క్వాడ్-కోర్ ప్రాసెసర్ అమర్చారు. మీరు గూగుల్ ప్లే స్టోర్ నుండి 10,000కు పైగా యాప్‌లు, గేమ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్, యాపిల్ టీవీ, జియోహాట్‌స్టార్, జీ5, సోనీలివ్ వంటి OTT యాప్‌లకు కూడా యాక్సెస్ అందిస్తుంది. ఇందులో అనేక OTT యాప్‌ల కోసం ప్రత్యేక బటన్లు కూడా ఉన్నాయి. కనెక్టివిటీ కోసం ఈ స్మార్ట్ టీవీ సిరీస్‌లో వైఫై, HDMI, బ్లూటూత్, USB వంటి ఫీచర్లు ఉన్నాయి.