మినీ LED, 108W సౌండ్, Quantum డాట్ టెక్నాలజీతో Kodak 65 అంగుళాల IconiK Google TV భారత్‌లో లాంచ్..!
- Kodak IconiK టీవీ 65 అంగుళాల 4K Mini LED లాంచ్..
- 120Hz రిఫ్రెష్ రేట్, VRR, ALLM సపోర్ట్‌తో గేమింగ్‌కు అనుకూలంగా
- 108W పవర్ఫుల్ సౌండ్, Dolby Atmos సపోర్ట్
- Google TV ప్లాట్‌ఫామ్, Google Assistant, Chromecast, Apple AirPlay సపోర్ట్
- టీవీ ధర రూ. 57,999..
Kodak IconiK 65-inch Mini LED QD Google TV Launch: భారత టెలివిజన్ (TV) మార్కెట్లో కోడాక్ (Kodak) నుండి కొత్తగా IconiK సిరీస్‌లో భాగంగా 65 అంగుళాల మినీ QD గూగుల్ టీవీను లాంచ్ చేసింది. అధునాతన మినీ LED, క్వాంటమ్ డాట్ టెక్నాలజీ, 120Hz రిఫ్రెష్ రేట్, భారీ సౌండ్ అవుట్ పుట్ తో ఈ టీవీ హోమ్ ఎంటర్టైన్మెంట్ను మరింత ప్రీమియంగా మార్చేలా దీనిని తయారు చేశారు.
4K Mini LED డిస్ప్లే, టెక్నాలజీ:
ఈ టీవీ 65 అంగుళాల బెజెల్‌లెస్ 4K (3840 × 2160) డిస్ప్లేతో వస్తుంది. అలాగే ఇది 120Hz రిఫ్రెష్ రేట్, VRR, ALLM సపోర్ట్‌తో గేమింగ్, వీడియో ప్లేబ్యాక్ చాలా స్మూత్‌గా అందిస్తుంది. క్వాంటమ్ డాట్ టెక్నాలజీతో పాటు 288 లోకల్ డిమ్మింగ్ జోన్లు ఉండటంతో డీప్ బ్లాక్స్, బ్రైట్ కలర్స్ స్పష్టంగా కనిపిస్తాయి. ఇక ఈ డిస్ప్లే1500 నిట్స్ బ్రైట్నెస్, 1.1 బిలియన్ కలర్స్, అల్ట్రా WCG, డాల్బీ విజన్, HDR10, HLG సపోర్ట్‌తో సినిమాలు, వెబ్ సిరీస్‌లు అద్భుతమైన క్వాలిటీలో కనిపిస్తాయి.
Also Read
- రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
- Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
- మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
- Vivo X300 Ultra, Vivo X300 FE: కెమెరా కింగ్‌గా రాబోతున్న Vivo X300 సిరీస్.. రిలీజ్ డేట్ ఫిక్స్
పవర్ఫుల్ సౌండ్:
ఈ టీవీలో 6 స్పీకర్లు, 2 సబ్వూఫర్లు కలిపి మొత్తం 108W సౌండ్ అవుట్ పుట్ అందించారు. డాల్బీ లాబొరేటరీస్ రూపొందించిన ‘డాల్బీ ఆటమ్స్’ టెక్నాలజీ సపోర్ట్ తో మల్టీ ఛానల్ ఆడియో అనుభవం లభిస్తుంది. దీంతో ఇంట్లోనే థియేటర్ స్థాయి సౌండ్ అనుభవం పొందవచ్చు.

స్మార్ట్ ఫీచర్లు:
ఈ టీవీ గూగుల్ అందించే ‘గూగుల్ టీవీ’ ప్లాట్‌ఫామ్‌పై పనిచేస్తుంది. గూగుల్ అసిస్టెంట్ ద్వారా వాయిస్ కమాండ్స్ తో టీవీని సులభంగా నియంత్రించవచ్చు. అలాగే బిల్ట్-ఇన్ క్రోమ్ క్యాస్ట్, ఆపిల్ ఎయిర్ ప్లే సపోర్ట్‌తో మొబైల్ నుంచి టీవీకి కంటెంట్‌ను స్ట్రీమ్ చేయవచ్చు. గూగుల్ ప్లే ద్వారా అనేక యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది.
ప్రాసెసర్:
ఈ టీవీ మీడియాటెక్ ప్రాసెసర్, Mali-G52 GPUతో వస్తుంది. ఇది 2GB ర్యామ్, 16GB స్టోరేజ్ తో యాప్స్, సిస్టమ్ పనితీరు స్మూత్‌గా ఉంటుంది. కనెక్టివిటీ కోసం Wi-Fi, బ్లూటూత్ 5.0, 3 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్, eARC, ఆప్టికల్, ఈథర్నెట్ వంటి అన్ని అవసరమైన ఆప్షన్లు అందించారు.

ధర:
కోడాక్ IconiK సిరీస్ 65 అంగుళాల మినీ QD గూగుల్ టీవీ ధర రూ. 57,999గా నిర్ణయించారు. ఈ టీవీ అమెజాన్ ఇండియాలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్‌గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!