Jio Bharat V4: రూ.799కే Jio Bharat V4 4G ఫీచర్ ఫోన్ విడుదల.. యూపీఐ, లైవ్ టీవీ, స్మార్ట్ ఫీచర్స్ తో

  • Jio Bharat V4 4G ఫీచర్ ఫోన్
  • రూ.799కే
  • స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ చేసుకునే సౌకర్యం
Jio Bharat V4

Jio Bharat V4

టెలికాం దిగ్గజం Jio మరోసారి బడ్జెట్ వినియోగదారులను ఆకట్టుకునే కొత్త ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకొచ్చింది. కంపెనీ తన Jio Bharat సిరీస్‌లో భాగంగా Jio Bharat V4 పేరుతో కొత్త 4G ఫీచర్ ఫోన్‌ను విడుదల చేసింది. కేవలం రూ.799 ధరతో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్‌లో UPI చెల్లింపులు, లైవ్ టీవీ, మ్యూజిక్ స్ట్రీమింగ్ వంటి పలు ఆధునిక ఫీచర్లను అందించారు.

రూ.799కే ఎన్నో ఫీచర్లు

Jio Bharat V4 ఫోన్‌ను ప్రత్యేకంగా తక్కువ ధరలో డిజిటల్ సేవలు అందించాలని కోరుకునే వినియోగదారుల కోసం రూపొందించారు. ఈ ఫోన్‌లో UPI డిజిటల్ పేమెంట్స్ 375కు పైగా Live TV ఛానెల్స్, 80 మిలియన్లకు పైగా పాటల యాక్సెస్, JioTV, JioHotstar సపోర్ట్, 4G కనెక్టివిటీ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

×
×
Ad

స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ చేసుకునే సౌకర్యం

Jio Bharat V4లో ప్రత్యేకమైన Safety Shield ఫీచర్‌ను అందించారు. దీని ద్వారా ఫోన్‌ను స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు. వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లో JioThings App ఇన్‌స్టాల్ చేసుకుంటే ఫోన్ లొకేషన్ ట్రాక్ చేయవచ్చు. బ్యాటరీ స్థాయిని చూడవచ్చు. కాల్స్‌ను మేనేజ్ చేయొచ్చు. తెలియని నంబర్లను బ్లాక్ చేయవచ్చు. ఈ ఫీచర్లు ముఖ్యంగా పిల్లలు, వృద్ధులకు మరింత ఉపయోగకరంగా ఉంటాయి.

వినోదానికి పూర్తి ప్యాకేజీ

Jio Bharat V4లో JioTV, JioHotstar వంటి యాప్‌ల ద్వారా వినియోగదారులు వీడియోలు, వార్తలు, క్రీడలు, వినోద కార్యక్రమాలను వీక్షించవచ్చు. అదనంగా 80 మిలియన్లకు పైగా పాటలను వినే అవకాశం కూడా ఉంటుంది.

UPI చెల్లింపులకు మద్దతు

ఈ ఫోన్‌లో JioPay UPI యాప్‌ను అందించారు. దీంతో బ్యాంక్ ఖాతాను లింక్ చేసి సులభంగా UPI ద్వారా డబ్బు పంపడం, స్వీకరించడం, చెల్లింపులు చేయడం సాధ్యమవుతుంది. Jio Bharat V4 ఫోన్ Black, Blue రంగుల్లో అందుబాటులో ఉంది. వినియోగదారులు ఈ ఫోన్‌ను Jio అధికారిక వెబ్‌సైట్, Jio Stores ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.