Jio Bharat V4: రూ.799కే Jio Bharat V4 4G ఫీచర్ ఫోన్ విడుదల.. యూపీఐ, లైవ్ టీవీ, స్మార్ట్ ఫీచర్స్ తో
- Jio Bharat V4 4G ఫీచర్ ఫోన్
- రూ.799కే
- స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ చేసుకునే సౌకర్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెలికాం దిగ్గజం Jio మరోసారి బడ్జెట్ వినియోగదారులను ఆకట్టుకునే కొత్త ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకొచ్చింది. కంపెనీ తన Jio Bharat సిరీస్‌లో భాగంగా Jio Bharat V4 పేరుతో కొత్త 4G ఫీచర్ ఫోన్‌ను విడుదల చేసింది. కేవలం రూ.799 ధరతో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్లో UPI చెల్లింపులు, లైవ్ టీవీ, మ్యూజిక్ స్ట్రీమింగ్ వంటి పలు ఆధునిక ఫీచర్లను అందించారు.
రూ.799కే ఎన్నో ఫీచర్లు
Jio Bharat V4 ఫోన్‌ను ప్రత్యేకంగా తక్కువ ధరలో డిజిటల్ సేవలు అందించాలని కోరుకునే వినియోగదారుల కోసం రూపొందించారు. ఈ ఫోన్లో UPI డిజిటల్ పేమెంట్స్ 375కు పైగా Live TV ఛానెల్స్, 80 మిలియన్లకు పైగా పాటల యాక్సెస్, JioTV, JioHotstar సపోర్ట్, 4G కనెక్టివిటీ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
Also Read
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- 50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
- 200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ చేసుకునే సౌకర్యం
Jio Bharat V4లో ప్రత్యేకమైన Safety Shield ఫీచర్‌ను అందించారు. దీని ద్వారా ఫోన్‌ను స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు. వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లో JioThings App ఇన్స్టాల్ చేసుకుంటే ఫోన్ లొకేషన్ ట్రాక్ చేయవచ్చు. బ్యాటరీ స్థాయిని చూడవచ్చు. కాల్స్‌ను మేనేజ్ చేయొచ్చు. తెలియని నంబర్లను బ్లాక్ చేయవచ్చు. ఈ ఫీచర్లు ముఖ్యంగా పిల్లలు, వృద్ధులకు మరింత ఉపయోగకరంగా ఉంటాయి.
వినోదానికి పూర్తి ప్యాకేజీ
Jio Bharat V4లో JioTV, JioHotstar వంటి యాప్‌ల ద్వారా వినియోగదారులు వీడియోలు, వార్తలు, క్రీడలు, వినోద కార్యక్రమాలను వీక్షించవచ్చు. అదనంగా 80 మిలియన్లకు పైగా పాటలను వినే అవకాశం కూడా ఉంటుంది.
UPI చెల్లింపులకు మద్దతు
ఈ ఫోన్లో JioPay UPI యాప్‌ను అందించారు. దీంతో బ్యాంక్ ఖాతాను లింక్ చేసి సులభంగా UPI ద్వారా డబ్బు పంపడం, స్వీకరించడం, చెల్లింపులు చేయడం సాధ్యమవుతుంది. Jio Bharat V4 ఫోన్ Black, Blue రంగుల్లో అందుబాటులో ఉంది. వినియోగదారులు ఈ ఫోన్‌ను Jio అధికారిక వెబ్సైట్, Jio Stores ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.
- Tags
- Jio
- Jio Bharat V4
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!