NTV Telugu Site icon

James Webb telescope: యురేనస్ గ్రహాన్ని ఇంతకుముందు ఎప్పుడూ ఇలా చూసుండరు..

Uranus

Uranus

James Webb telescope clicks Uranus: జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ విశ్వంలోని అనేక అద్భుతాలను మనముందు ఉంచుతోంది. హబుల్ టెలిస్కోప్ తో పోలిస్తే చాలా శక్తివంతమైన టెలిస్కోప్ అయిన జేమ్స్ వెబ్ విశ్వ మూలాల్లోని ఖగోళ అద్భుతాలను శాస్త్రవేత్తలకు అందిస్తోంది. విశ్వం పుట్టుక, అత్యంత పురాతన గెలాక్సీలు, నక్షత్రాల పుట్టుక, బ్లాక్ హోల్స్, పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్స్ వంటి వాటిని భూమికి పంపించింది. విశ్వ రహస్యాలను చేధించేందుకు తన వంతు సహకారాన్ని అందిస్తోంది.

Read Also: Salman Khan: సల్మాన్ ఖాన్‌కు హత్యా బెదిరింపులు.. హై ఎండ్ బుల్లెట్ ఫ్రూఫ్ ఎస్‌యూవీ కొనుగోలు..ప్రత్యేకతలివే..

ఇదిలా ఉంటే మరోసారి ఓ అద్భుత ఫోటోతో జేమ్స్ వెబ్ మళ్లీ వార్తల్లో నిలిచింది. సౌర వ్యవస్థలో మూడో అతిపెద్ద గ్రహం, గ్యాస్ జెయింట్ అయిన యురేనస్ గ్రహాన్ని తన కెమెరాలతో బంధించింది. గతంలో ఎప్పుడూ కూడా యురేనస్ గ్రహాన్ని ఇంత స్పష్టంగా చూసింది లేదు. యురేనస్ చుట్టూ ఉన్న వలయాలతో పాటు దాని చంద్రులను క్లిక్ చేసింది. తొలిసారిగా 1986లో వయోజర్ 2 స్పేస్ క్రాఫ్ట్ యురేనస్ కు సంబంధించిన క్లియర్ ఇమేజెస్ పంపింది.

యురేనస్ చాలా ప్రత్యేకమైన గ్రహం. ఇది తన చుట్టూ 90 డిగ్రీల కోణంలో తిరుగుతుంది. సూర్యుడి చుట్టు ఒక చుట్టూ తిరగేందుకు 84 ఏళ్లు పడుతుంది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఈ గ్రహాన్ని 12 నిమిషాల పాటు పరిశీలించి, యురేనస్ తో పాటు దాని 27 ఉపగ్రహాల్లో ఆరింటిని చిత్రీకరించింది. టెలిస్కోప్ నియర్ ఇన్ ఫ్రారెడ్ కెమెరాతో యురేనస్ ను ఫోటో తీసింది. ఈ ఫోటోలు యురేనస్ గురించి మరింత సమాచారాన్ని తెలుసుకునేందుకు సహాయపడనున్నాయి. యురేనస్ కు సంబంధించి ప్రస్తుతం 13 రింగ్స్ ఉన్నాయి. శని గ్రహం తరువాత వలయాలు కలిగిన గ్రహం యురేనస్.