రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!

  • భారత మార్కెట్లో itel City 300 5G లాంచ్..
  • 6.67 అంగుళాల డిస్‌ప్లే, HD+ పంచ్-హోల్ LCD స్క్రీన్‌
  • Unisoc T8200 చిప్.. 6nm ప్రాసెస్‌పై తయారైన ఆక్టా-కోర్ ప్రాసెసర్‌
  • 5000mAh బ్యాటరీతో పాటు USB Type-C ఛార్జింగ్ సపోర్ట్..
  • వెనుక 13MP ఆటోఫోకస్ కెమెరా, ముందు 8MP సెల్ఫీ కెమెరా..
Itel City 300 5g

Itel City 300 5g

itel City 300 5G: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో ఐటెల్ (itel) మరో కొత్త 5G ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఐటెల్ సిటీ 300 5G (itel City 300 5G) పేరుతో లాంచ్ చేసిన ఈ ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ, 5G కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఎంట్రీ-లెవల్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ కొత్త మొబైల్ లో 6.67 అంగుళాల HD+ పంచ్ హోల్ LCD డిస్‌ప్లేను అందించారు. ఇది 720×1600 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. 2.5D కర్వ్డ్ గ్లాస్ డిజైన్‌తో వచ్చే ఈ స్క్రీన్.. స్క్రోలింగ్, వీడియోలు చూడటం, సాధారణ గేమింగ్ సమయంలో స్మూత్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించనుంది. ఫోన్ 8.4 మిల్లీమీటర్ల మందంతో ఉంటుంది. డార్క్ రూబీ, మిస్ట్ బీజ్, బోల్డ్ ఇండిగో కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది.

పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే.. ఇందులో 6nm ప్రాసెస్‌పై తయారైన Unisoc T8200 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 2.3GHz వరకు క్లాక్ స్పీడ్‌తో పనిచేసే ఈ చిప్‌కు Mali-G57 MC2 GPU జత చేశారు. 4GB LPDDR4x RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. మైక్రోSD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 1TB వరకు పెంచుకోవచ్చు. కనెక్టివిటీ పరంగా ఈ ఫోన్ 5G SA/NSAతో పాటు మొత్తం 10 5G బ్యాండ్లకు సపోర్ట్ చేస్తుంది. NRCA టెక్నాలజీ ద్వారా అనుకూలమైన నెట్‌వర్క్‌లలో కనెక్టివిటీని మెరుగుపరచేలా రూపొందించారు. అలాగే itel UltraLink ఉచిత కాలింగ్ ఫీచర్‌ను కూడా అందిస్తోంది.

దీనితో పాటు 4G VoLTE, Wi-Fi 802.11ac, Bluetooth 5.0, GPS, GLONASS, USB Type-C వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో డ్యూయల్ నానో సిమ్‌తో పాటు ప్రత్యేక మైక్రోSD కార్డ్ స్లాట్‌ను అందించారు. ఇక ఇందులో 5000mAh బ్యాటరీ ఉంది. USB Type-C పోర్ట్ ద్వారా ఛార్జింగ్ చేయవచ్చు. బాక్స్‌లో 10W పవర్ అడాప్టర్‌ను అందిస్తున్నారు.

కెమెరాల విషయానికొస్తే.. వెనుక భాగంలో LED ఫ్లాష్‌తో కూడిన 13MP ఆటోఫోకస్ కెమెరాను అందించారు. ఇది 2K రిజల్యూషన్‌లో 30fps వరకు వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో f/2.2 అపెర్చర్‌తో 8MP కెమెరా ఉంది. సెక్యూరిటీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌తో పాటు ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను అందించారు. సాఫ్ట్‌వేర్ విషయానికొస్తే.. ఈ ఫోన్ Android 16 Go Editionపై పనిచేస్తుంది. తక్కువ హార్డ్‌వేర్ సామర్థ్యం ఉన్న డివైజ్‌లలో మెరుగైన పనితీరును అందించేందుకు Go Editionను ఆప్టిమైజ్ చేశారు. భారత్‌లో itel City 300 5G ధర రూ.14,999గా నిర్ణయించారు. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంది.