iTel Ace 3 Heera: రూ.949కే బెస్ట్ ఫీచర్ ఫోన్.. వాయిస్ అసిస్టెంట్, 13 రోజుల బ్యాటరీ.. ఇంకా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iTel Ace 3 Heera: బడ్జెట్ ధరలో ఫీచర్ ఫోన్ కొనాలనుకునే వినియోగదారుల కోసం ఐటెల్ భారత మార్కెట్లో Ace 3 Heera పేరుతో కొత్త కీప్యాడ్ ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ ధర కేవలం రూ.949 మాత్రమే. ముఖ్యంగా, ఈ ధరలో USB Type-C ఛార్జింగ్ పోర్ట్ అందించిన తొలి ఫీచర్ ఫోన్ ఇదేనని కంపెనీ తెలిపింది.
USB Type-Cతో ప్రత్యేక ఆకర్షణ
ఇప్పటి వరకు ఈ ధరలో లభించే చాలా ఫీచర్ ఫోన్లలో మైక్రో-USB పోర్ట్ ఉండేది. అయితే Ace 3 Heeraలో Type-C పోర్ట్ ఇవ్వడం వల్ల ప్రస్తుతం స్మార్ట్ఫోన్లకు ఉపయోగించే ఛార్జింగ్ కేబుల్‌తోనే ఈ ఫోన్‌ను కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో తమ అన్ని ఫీచర్ ఫోన్లలో Type-C పోర్ట్‌ను అందించనున్నట్లు ఐటెల్ వెల్లడించింది.
Also Read
- iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
- మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
- 1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
- BIS Certification: మొబైల్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కొత్త రూల్.. ఇక నాసిరకం టెంపర్డ్ గ్లాస్‌కు చెక్..!
డిస్ప్లే, బ్యాటరీ వివరాలు
ఈ ఫోన్లో 1.8 అంగుళాల డిస్ప్లే ఉంది. 1000mAh బ్యాటరీను అందించగా, ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 13 రోజుల వరకు స్టాండ్‌బై సమయం అందుతుందని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా AI Battery Optimization, Super Battery Mode వంటి ఫీచర్లు బ్యాటరీ వినియోగాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహిస్తాయి.
వాయిస్ అసిస్టెంట్‌తో పాటు మరిన్ని ఫీచర్లు
Ace 3 Heeraలో హిందీ, ఇంగ్లీష్ భాషలకు మద్దతు ఇచ్చే King Talker Voice Assistant అందుబాటులో ఉంది. అలాగే వైర్లెస్ FM రేడియో, FM రికార్డింగ్, ఆటో కాల్ రికార్డింగ్, డ్యూయల్ సిమ్, ఫ్లాష్‌లైట్, బ్లూటూత్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
స్టోరేజ్, మెమరీ
ఈ ఫోన్లో 32MB RAM, 32MB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. మైక్రో SD కార్డ్ ద్వారా 32GB వరకు స్టోరేజ్‌ను విస్తరించుకోవచ్చు. మెమరీ కార్డ్‌లోని పాటలను నేరుగా రింగ్టోన్లుగా సెట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అలాగే 200 కాంటాక్ట్‌ల వరకు సేవ్ చేసుకునే సౌకర్యం కల్పించారు.
ధర, లభ్యత
iTel Ace 3 Heera ధర రూ.949. ఈ ఫోన్ దేశవ్యాప్తంగా ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంది. తక్కువ బడ్జెట్లో కాలింగ్, మెసేజింగ్, FM రేడియో, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కలిగిన ఫీచర్ ఫోన్ కోసం చూస్తున్న వారికి ఇది మంచి ఎంపికగా నిలవొచ్చు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!