ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వినియోగం రోజూ రోజుకు పెరిగిపోతుంది.. దాంతో కంపెనీలు కూడా పోటి పడుతూ అదిరిపోయే ఫీచర్ల తో కొత్త ఫోన్లను మార్కెట్ లోకి లాంచ్ చేస్తున్నారు.. వాటి ఫీచర్స్ ను బట్టి డిమాండ్ కూడా కాస్త ఎక్కువగాన ఉంటుంది.. ఇటీవల కొత్త స్మార్ట్ ఫోన్లు మార్కెట్ లోకి విడుదల అవుతున్నాయి.. ఈ క్రమంలో ఐకూ 5జీ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చెయ్యనున్నారు.. ఆ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల అవ్వక ముందే డిమాండ్ కూడా భారీగా పెరిగిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.. ఫీచర్స్ ను ఒకసారి చూద్దామా..
ఐకూ కంపెనీ భారత మార్కెట్లోకి త్వరలోనే ఐకూ జెడ్7 పేరుతో ఓ 5జీ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. వచ్చే నెల మిడిల్‌లో ఈ ఫోన్ మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది.. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ను మిడిల్ రేంజ్ బడ్జెట్‌లో తీసుకురానున్నారు.. అయితే ఈ ఫోన్‌లో ఫీచర్లకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రటన రాలేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న కథనాల ప్రకారం కొన్ని ఫీచర్లు బయటకు వచ్చాయి… ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ స్మార్ట్ ఫోన్‌లో 1,080 x 2,400 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల కర్వ్డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు..ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేసే ఈ ఫోన్లో మీడియా టెక్ డైమెన్సిటీ 7200 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను ఇవ్వనున్నారు. 66 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ అందించనున్నారు..ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో 64 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతోపాటు, సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు. ధర విషయానికొస్తే రూ. 25 నుంచి రూ. 30 వేల వరకు ధర ఉంటుందని అంచనా..మరి మార్కెట్ లో డిమాండ్ ఎలా ఉంటుందో చూడాలి..
