7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iQOO Z12 Series Leak: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో భారీ బ్యాటరీ ఫోన్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో iQOO మరో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. తన Z సిరీస్‌లో భాగంగా 10,000mAh కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న బ్యాటరీతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. లీకైన వివరాల ప్రకారం.. ఈ ఫోన్లో ఏకంగా 7 ఇంచుల భారీ డిస్ప్లే ఉండనుంది. ఇది రాబోయే iQOO Z12 సిరీస్‌లో భాగంగా వచ్చే అవకాశం ఉంది.
లీకైన సమాచారం ప్రకారం.. ఈ కొత్త iQOO స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ‘మోల్డ్ స్టేజ్’ అభివృద్ధి దశకు చేరుకుంది. అంటే ఫోన్‌కు సంబంధించిన డిజైన్, స్పెసిఫికేషన్స్ దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. అయితే లాంచ్‌కు ముందు హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్లలో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి పేరు, ప్రాసెసర్, కెమెరా వివరాలు ఇంకా వెల్లడికాలేదు.
Also Read
- Vivo T5e: వివో T5e స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. 48% తగ్గింపుతో రూ.13,999కే.. 5500mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లే
- Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
- Airtel నుంచి 'Buy 1 Get 1' ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
- Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!
ఈ ఫోన్లో 7 ఇంచుల భారీ డిస్ప్లేను అందించనున్నట్లు లీక్స్ చెబుతున్నాయి. ముఖ్యంగా 10,000mAh కంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకతగా ఉండనుంది. భారీ స్క్రీన్‌తో పాటు ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని iQOO ఈ ఫోన్‌ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 2027 మధ్య నాటికి చైనా మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఈ ఫోన్ అసలు పేరు ఏమిటనేది స్పష్టంగా తెలియలేదు. అయితే ఇది iQOO Z12 సిరీస్‌లో భాగంగా రావచ్చని అంచనా. చైనా మార్కెట్ కోసం iQOO Z12 Turboను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే గ్లోబల్ మార్కెట్ల కోసం iQOO Z12x, iQOO Z12 Lite మోడళ్లను కూడా సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా iQOO Z12S పేరుతో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక నిర్ధారణ లేదు. ఇప్పటికే iQOO Z11 సిరీస్‌లో భారీ బ్యాటరీ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. iQOO Z11లో 9,020mAh బ్యాటరీ ఉండగా.. iQOO Z11Sలో 10,000mAh బ్యాటరీని అందించారు. మరోవైపు iQOO Z11 Turbo మోడల్లో ఫ్లాగ్షిప్ స్థాయి ప్రాసెసర్‌ను అందించారు.
తాజావార్తలు
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Ram Gopal Varma: “ఆ కుక్కలను పట్టించుకోవద్దు”.. ‘రామాయణం’పై ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ రివ్యూ
-
Raaka Update: ముంబై టు హైదరాబాద్.. ‘రాకా’ షిఫ్ట్.!
-
Pakistan TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ దారుణ హత్య.. భర్తపైనే అనుమానాలు!
-
CM Chandrababu: స్థానిక ఎన్నికల్లో కూటమికి అఖండ విజయం.. 2024 కంటే మెరుగైన ఫలితాలు!
ట్రెండింగ్
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!
-
IPL 2027: టీమిండియా పవర్ హిట్టర్‌పై కన్ను.. గుజరాత్ టైటాన్స్‌ది పెద్ద ప్లానే!