NTV Telugu Site icon

iQOO Neo 10R:పవర్ ఫుల్ ఫీచర్స్ తో.. ఐకూ నుంచి మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్

Iqoo

Iqoo

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ ఐకూ తన అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. స్టన్నింగ్ డిజైన్, పవర్ ఫుల్ ఫీచర్స్ తో, మిడ్ రేంజ్ బడ్జెట్ ధరలో కొత్త ఫోన్ ను తీసుకురాబోతోంది. iQOO త్వరలో భారత మార్కెట్లో నియో 10R ను విడుదల చేయనుంది. అయితే ఐకూ నియో 10R స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6400mAh బ్యాటరీ, 50MP + 8MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఫోన్ యొక్క ప్రధాన లెన్స్ 50MP సోనీ LYT-600 సెన్సార్ ను కలిగి ఉంటుంది. దీనికి 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది. ఇది 256GB స్టోరేజ్, 12GB RAM తో వస్తున్నట్లు టాక్.ఈ ఫోన్ ను ర్యాగింగ్ బ్లూ అనే బ్యూటీఫుల్ కలర్ వేరియంట్ లో లాంచ్ చేస్తున్నట్లు కూడా కన్ఫర్మ్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్ Qualcomm Snapdragon 8s Gen 3 ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.78-అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌ తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఫన్‌టచ్ OS 15పై పని చేస్తుంది. IP64 రేటింగ్ తో రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంటుందని తెలిపింది. కంపెనీ దీనిని రూ. 30 వేల బడ్జెట్‌లో ప్రారంభించొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.