iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!

  • iQOO 16 స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది
  • భారీ బ్యాటరీ, 165Hz డిస్‌ప్లే, 50MP కెమెరాలు!
Iqoo 16

Iqoo 16

iQOO 16 Launch in India Soon: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO తదుపరి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ iQOO 16ను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. భారీ బ్యాటరీ, హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, శక్తివంతమైన ప్రాసెసర్, అధునాతన కెమెరాలతో ఈ ఫోన్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలోకి రానుందని అంచనా. అయితే, ఫోన్ పేరు, ఫీచర్లు, విడుదల తేదీని కంపెనీ అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు. లీకుల ప్రకారం, iQOO 16 2026 డిసెంబర్‌లో లేదా 2027 ప్రారంభంలో భారత్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే, ఖచ్చితమైన లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించలేదు.

iQOO 16 ధర ఎంత ఉండొచ్చు?

ఈ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో సుమారు రూ.1 లక్ష ధరల శ్రేణిలో విడుదల చేయవచ్చని అంచనా. గతంలో iQOO 15 ప్రారంభ ధర రూ.85,999గా ఉంది. అయితే, iQOO 16 ధరకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడలేదు. అసలు ధర ఫోన్ వేరియంట్లు, స్టోరేజ్ సామర్థ్యం, మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉండవచ్చు.

iQOO 16లో 6.85 అంగుళాల 2K+ M16 LTPO AMOLED డిస్‌ప్లే అందించవచ్చని సమాచారం. రిఫ్రెష్ రేట్ 165Hz వరకు, గరిష్ఠ బ్రైట్‌నెస్ 10,000 నిట్స్ వరకు అని అంచనా. 165Hz రిఫ్రెష్ రేట్‌తో గేమింగ్, వీడియోలు చూడటం, సోషల్ మీడియా స్క్రోలింగ్ వంటి పనులు మరింత స్మూత్‌గా ఉండే అవకాశం ఉంది. అయితే, గరిష్ఠ బ్రైట్‌నెస్ వివరాలు కూడా అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది.

ఈ ఫోన్‌లో Qualcomm Snapdragon 8 Elite Extreme Gen 6 ప్రాసెసర్‌తో పాటు ప్రత్యేక Q4 గేమింగ్ చిప్ ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ హార్డ్‌వేర్ అందుబాటులోకి వస్తే హై-ఎండ్ గేమింగ్, మల్టీటాస్కింగ్, గ్రాఫిక్స్ పనితీరుకు ఉపయోగపడవచ్చు. అయితే, ఈ ప్రాసెసర్ పేరుతో సహా చిప్‌సెట్ వివరాలను కంపెనీ అధికారికంగా ధృవీకరించలేదు. iQOO 16లో 8,400mAh బ్యాటరీ ఉండవచ్చని అంచనా. దీనికి 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభించవచ్చని సమాచారం.

ఫోటోగ్రఫీ కోసం iQOO 16లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించవచ్చని అంచనా. 50MP ప్రైమరీ కెమెరా.. OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో, 50MP అల్ట్రా వైడ్ కెమెరా.. పనోరమిక్ వ్యూస్ తీయడానికి, 50MP టెలిఫోటో కెమెరా.. 3x జూమ్ సపోర్ట్‌తో, 32MP ఫ్రంట్ కెమెరా.. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ కెమెరా సెటప్ అధికారికంగా నిర్ధారణ అయితే, సాధారణ ఫోటోగ్రఫీతో పాటు జూమ్ ఫోటోలు, ల్యాండ్‌స్కేప్ చిత్రాలు తీయడానికి ఉపయోగపడుతుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ Android 17 ఆధారిత OriginOS 7తో పనిచేయవచ్చని సమాచారం. అయితే, ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్, భారతీయ వేరియంట్‌లో అందించే సాఫ్ట్‌వేర్ వివరాలపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.