iQOO 15R India Launch: iQOO 15R త్వరలోనే భారత మార్కెట్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇటీవల గీక్‌బెంచ్‌లో ఈ ఫోన్‌కు సంబంధించిన లిస్టింగ్ లో కనిపించడంతో.. దాని హార్డ్‌వేర్ వివరాలు బయటకు వచ్చాయి. ఇప్పటికే iQOO సంస్థ ఈ స్మార్ట్‌ఫోన్ భారత్‌లో విడుదల కానుందని, అమెజాన్ ద్వారా విక్రయాలు జరగనున్నాయని అధికారికంగా ధృవీకరించింది. అయితే, ఇప్పటి వరకు లాంచ్ తేదీని మాత్రం ప్రకటించలేదు. గీక్‌బెంచ్ లిస్టింగ్ ఆధారంగా చూస్తే, ఈ ఫోన్ విడుదల చాలా దగ్గరలోనే ఉండొచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Read Also: Naduma Murari : శర్వానంద్-శ్రీవిష్ణు మల్టీస్టారర్?
iQOO 15R భారత్‌లో లాంచ్‌కు సిద్ధమవుతోందా?
iQOO 15R త్వరలోనే భారత మార్కెట్‌లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల గీక్‌బెంచ్‌లో ఈ ఫోన్‌కు సంబంధించిన లిస్టింగ్ వెలుగులోకి వచ్చింది. దాని హార్డ్‌వేర్ వివరాలు ఇప్పటికే సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే ఈ ఫోన్ భారత్‌లో లాంచ్ అవుతుందని, అమెజాన్ ద్వారా అమ్మకాలు జరగనున్నాయని iQOO అధికారికంగా ధృవీకరించింది. అయితే లాంచ్ తేదీ మాత్రం ఇంకా ప్రకటించలేదు.
గీక్‌బెంచ్ లిస్టింగ్‌లో కీలక వివరాలు:
టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. “Vivo I2508” అనే మోడల్ నంబర్‌తో ఈ ఫోన్ గీక్‌బెంచ్‌లో కనిపించింది. ఇది భారత మార్కెట్‌కు వచ్చే iQOO 15R వేరియంట్‌గా భావిస్తున్నారు. ఈ డివైస్‌కు 7,687 OpenCL స్కోర్ నమోదు కావడం గమనార్హం.
Read Also: Sharwanand: నిర్మాత కోసం రెమ్యూనరేషన్ వదులుకున్న శర్వా!
స్నాప్‌డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్:
ఈ ఫోన్‌లో ఆక్టా-కోర్ క్వాల్కమ్ చిప్‌సెట్ ఉన్నట్లు సమాచారం. ఇందులో రెండు హై-పర్‌ఫార్మెన్స్ కోర్లు 3.80GHz వరకు, మరో నాలుగు కోర్లు 3.32GHz వరకు క్లాక్ స్పీడ్‌తో పని చేస్తాయి. ఇవన్నీ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ లక్షణాలతో సరిపోలుతున్నాయి. దీంతో iQOO 15Rను ‘నియర్ ఫ్లాగ్‌షిప్’ కేటగిరీలో ఉంచే ఛాన్స్ ఉంది.
Android 16:
ఈ ఫోన్ Android 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. 8GB RAMతో పరీక్షించబడిందని గీక్‌బెంచ్ పేర్కొంది. అయితే లాంచ్ సమయంలో 12GB, 16GB RAM వేరియంట్లు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
iQOO Z11 Turboకి రీబ్రాండెడ్ వెర్షనా?
హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్లు చూస్తే, ఈ ఫోన్ చైనాలో ఇటీవల విడుదలైన iQOO Z11 Turboకి రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఉండొచ్చని అంచనా.
AMOLED డిస్‌ప్లే:
iQOO 15Rలో 6.59 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే ఉండే ఛాన్స్ ఉంది. దీనికి 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్, గేమింగ్ అండ్ స్క్రోలింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది.
రక్షణ:
ఈ ఫోన్‌కు IP68, IP69 రేటింగ్‌లు లభించే అవకాశం ఉంది. దీనివల్ల ధూళి, నీటి నుంచి ఫోన్‌కు మెరుగైన రక్షణ లభిస్తుంది.
భారీ స్టోరేజ్:
UFS 4.1 టెక్నాలజీతో 1TB వరకు ఇంటర్నల్ స్టోరేజ్, LPDDR5x ర్యామ్‌తో 16GB వరకు మెమరీ వేరియంట్లు వచ్చే ఛాన్స్ ఉంది.
200MP కెమెరా:
కెమెరా విభాగంలో 200MP ప్రైమరీ రియర్ కెమెరాతో పాటు 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ ఉండే ఛాన్స్ ఉంది. ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఇచ్చే అవకాశం ఉండగా.. అయితే ఈ ఫోన్‌లో కెమెరా కంటే పనితీరు, బ్యాటరీ లైఫ్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.
బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్:
బ్యాటరీ విభాగంలో iQOO 15R ప్రత్యేక ఆకర్షణగా నిలవొచ్చు.. ఇందులో 7,600mAh భారీ బ్యాటరీతో పాటు 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండనుంది. ఇది ఈ సెగ్మెంట్‌లోని ఇతర ఫోన్ల కంటే పెద్ద ప్లస్ పాయింట్.
ధర:
చైనాలో iQOO Z11 Turbo ప్రారంభ ధర CNY 2,699గా ఉంది. ఇది భారత కరెన్సీలో సుమారు రూ.36,000. అదే ధర పరిధిలో భారత్‌లో కూడా iQOO 15Rను విడుదల చేస్తే, ఫ్లాగ్‌షిప్ స్థాయి పని తీరు, వేగవంతమైన AMOLED డిస్‌ప్లే, భారీ బ్యాటరీ లైఫ్ కోరుకునే వినియోగదారులకు ఇది మంచి ఎంపికగా మారనుంది.
Precision you can feel. Power you can sense. ⚡
Every curve, every finish is crafted with intent, with a design that balances boldness with precision.
It is built to stand out the moment it arrives!
The wait won’t be long.
iQOO 15R. Arriving soon.#iQOO15R #AmazonSpecials pic.twitter.com/UXvavORB6N
— iQOO India (@IqooInd) January 23, 2026
