Site icon NTV Telugu

iPhone New Version: ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సిగ్నల్స్ లేని ప్రాంతాల్లో కూడా మ్యాప్స్‌, మెసేజింగ్‌ చేసుకోవచ్చు!

Iphone

Iphone

iPhone New Version: ఐఫోన్ లవర్స్‌కు యాపిల్ సంస్థ అదిరిపోయే న్యూస్ చెప్పింది. రాబోయే రోజుల్లో ఐఫోన్స్ కి మొబైల్ నెట్‌వర్క్‌తో అవసరం లేకుండా.. ఏకంగా శాటిలైట్ తోనే మొబైల్ ఫోన్ కాల్స్, మెసేజ్, మ్యాప్స్ షేర్ చేసుకునేలా ప్లాన్ చేస్తుంది. ఐఫోన్ యూజర్ల కోసం సరికొత్త శాటిలైట్ ఫీచర్లను ఆ కంపెనీ తీసుకొచ్చేందుకు రెడీ అయింది. ఈ ఫీచర్లు ఎలా ఉంటాయనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే, సాధారణంగా మీరు అడవిలో లేదా పర్వతాల మధ్య ఉన్నప్పుడు మొబైల్ సిగ్నల్స్ పని చేయవు. ఇలాంటి అనుభవం దాదాపు అందరికి ఎదురయ్యే ఉంటుంది. కానీ, త్వరలో యాపిల్ సంస్థ ఈ సమస్యకు చెక్ పెట్టబోతుంది.

Read Also: Kaantha : బయోపిక్కా..అబ్బే అవకాశమే లేదట!

అయితే, యాపిల్ శాటిలైట్ ఆధారిత కనెక్టివిటీని తీసుకొచ్చేందుకు సన్నాహాలు మొదలు పెట్టింది. ఈ శాటిలైట్ ఫీచర్ల సాయంతో ఏ నెట్‌వర్క్ అయినా కాల్స్ చేసుకోవడంతో పాటు ఎమర్జెన్సీ మెసేజ్‌లు కూడా పంపుకునే అవకాశం ఉంటుంది. కాగా, యాపిల్ మ్యాప్స్ లాంటి నావిగేషన్ యాప్‌లను నెట్‌వర్క్ లేని ప్రాంతాల్లో కూడా ఈజీగా వినియోగించవచ్చు.. ఒక్క మాటలో చెప్పాలంటే.. మొబైల్ నెట్‌వర్క్ లేకపోయినా.. మీరు ఇప్పటికీ మెసేజ్‌లు, మ్యాప్‌లతో కనెక్ట్ అయి ఉండే అవకాశం ఉంటుంది. నెట్‌వర్క్ కవరేజ్‌లో సవాళ్లు ఎదుర్కొంటున్న భారత్ లాంటి దేశంలో ఈ శాటిలైట్ ఫీచర్ అత్యంత కీలక పాత్ర పోషించనుంది.

Read Also: Meena : హీరో వద్దన్నా వినకుండా.. ఒక్కసారి హోటల్‌కు వచ్చి చాన్స్ ఇవ్వమని అడిగాడు: మీనా

శాటిలైట్ ఇంటిగ్రేషన్ ఫీచర్లు :
యాపిల్‌ సంస్థ ప్రస్తుతం తన ఐఫోన్‌లను నేరుగా శాటిలైట్‌లకు కనెక్ట్ చేసే ఆధునిక సాంకేతికతపై వర్క్ చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇంటర్నల్ శాటిలైట్ కనెక్టివిటీ గ్రూప్ టీమ్ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తుంది. ఇప్పటి వరకు ఐఫోన్‌లలో అందుబాటులో ఉన్న ఎమర్జెన్సీ SOS ద్వారా శాటిలైట్ ఫీచర్‌ను మరింత విస్తరించి, రోజువారీ వినియోగానికి అనుకూలంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇక, కొత్త శాటిలైట్ ఫీచర్లలో శాటిలైట్ ఆధారిత మెసేజింగ్‌, మ్యాప్స్ ఎమ్యులేషన్‌ వంటి సదుపాయాలు ఉండనున్నాయి. అయితే, భారత మార్కెట్లో ఈ శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్లు అందుబాటులోకి రావడం అంత ఈజీ కాదు. శాటిలైట్ స్పెక్ట్రం, లైసెన్సింగ్ నిబంధనలు, దేశీయ నెట్‌వర్క్ పార్టనర్ల సిద్ధత లాంటి అంశాలు పెద్ద సవాళ్లుగా నిలవొచ్చు. అదనంగా, యాపిల్- గ్లోబల్‌స్టార్ మధ్య నెట్‌వర్క్ విస్తరణ, మౌలిక సదుపాయాల అప్‌గ్రేడ్ వంటి అంశాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి.

ఈ ఐఫోన్లలోనే పని చేస్తుంది..
అయితే, ప్రస్తుతం ఈ ఫీచర్లు భారత మార్కెట్లో ఎప్పుడు లభిస్తాయో అనే దానిపై క్లారిటీ లేదు. ఇక, ఐఫోన్ 14తో పాటు ఆ తర్వాతి మోడల్స్ ఇప్పటికే శాటిలైట్ SOS ఎమర్జెన్సీ ఫీచర్‌కి సపోర్ట్ చేస్తున్నాయి. యాపిల్ సంస్థ తెలిపినట్లుగా, త్వరలో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ల ద్వారా మరిన్ని శాటిలైట్ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. యూజర్లు కోరుకుంటున్న మరో ముఖ్య అంశం 5G NTN (Non-Terrestrial Network) సపోర్ట్, ఇది సెల్ టవర్లు- శాటిలైట్లను కలిపడం వల్ల మరింత బలమైన కవరేజీని అందిస్తుంది. కాగా, యాపిల్ యాప్ తయారీదారుల కోసం శాటిలైట్ కనెక్షన్‌లను ఇంటిగ్రేట్ చేసే APIపై కూడా వర్క్ చేస్తోంది. దీని ద్వారా ట్రావెల్‌, హెల్త్‌, భద్రత వంటి అప్లికేషన్‌లు నెట్‌వర్క్‌ లేకుండా కూడా పని చేయగలవు.. ఇది ఆఫ్‌-గ్రిడ్‌ ప్రాంతాల్లో యూజర్లకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది.

Exit mobile version