iPhone Duo: స్క్రీన్ పగిలితే రూ. 1.5 లక్షలు గోవిందా.. ‘ఐఫోన్ డ్యుయో’తో జర భద్రం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iPhone Duo: యాపిల్ తీసుకొచ్చిన మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్ ‘ఐఫోన్ డ్యుయో’ మార్కెట్లోకి రాగానే పిచ్చ క్రేజ్ తెచ్చుకుంది. బుకింగ్స్ మొదలైన కొద్ది నిమిషాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడై స్టాక్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఫోన్ లుక్స్, అదిరిపోయే ఫీచర్లు చూసి టెక్ ప్రియులు ఫిదా అవుతున్నారు కానీ.. కంపెనీ చెప్పిన దీని రిపేరింగ్ ఖర్చులు చూసి మాత్రం మైండ్ బ్లాంక్ అయిపోతోంది. చేతిలోంచి ఫోన్ జారిపడి పొరపాటున లోపలి స్క్రీన్ పగిలితే.. ఆ రిపేర్ ఖర్చుతోనే హాయిగా మరో బ్రాండ్ న్యూ ఐఫోన్ కొనేయొచ్చు.
కంపెనీ అధికారిక లెక్కల ప్రకారం.. ఐఫోన్ డ్యుయో లోపలి మెయిన్ ఫోల్డబుల్ డిస్ప్లే డ్యామేజ్ అయితే దాన్ని మార్చడానికి కంపెనీ ఏకంగా రూ. 1,49,900 ఛార్జ్ చేస్తోంది. బయట మార్కెట్లో దొరికే చాలా ఫ్లాగ్షిప్ ఫోన్ల ధర కంటే కేవలం ఈ ఒక్క స్క్రీన్ మార్చే ఖర్చే ఎక్కువ. బయటి స్క్రీన్కు ఏదైనా జరిగితే రూ. 42,900, ఒకవేళ ఔటర్ స్క్రీన్‌తో పాటు బ్యాక్ గ్లాస్ కూడా పగిలితే రూ. 55,900 సమర్పించుకోవాల్సిందే. ఇక బ్యాక్ గ్లాస్ మార్చడానికి
రూ.20,900, బ్యాటరీ చేంజ్‌కి రూ.24,900, కెమెరా రిపేర్ అయితే రూ.26,900 వసూలు చేస్తున్నారు. ఒకవేళ ఫోన్ మరీ దారుణంగా డ్యామేజ్ అయితే ఇతర రిపేర్ల ఖర్చు ఏకంగా రూ. 2,24,900 వరకు ఉంటుంది.
Also Read
- Lenovo IdeaPad Vibe 15Q8X12: లెనోవా IdeaPad Vibe 15Q8X12 లాంచ్.. Snapdragon X ప్రాసెసర్, 15-ఇంచ్ డిస్ప్లే
- Tesla: ఫ్లయింగ్ కారు కేవలం శాంపిల్ మాత్రమే.. మస్క్ నెక్ట్స్ ఈ మూడు ప్రాజెక్టుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
- OPPO Find X10 Pro Max: 200MP + 200MP + 200MP కెమెరాలతో ఒప్పో ఫైండ్ ఎక్స్10 సిరీస్.. భారత్‌లో లాంచ్ డేట్ ఫిక్స్
- Apple iPhone Duo: ఆపిల్ iPhone Duo ప్రీ-ఆర్డర్లు నేటి నుంచే.. రూ.7,000 క్యాష్‌బ్యాక్, ధర ఎంతంటే!
రిపేరింగ్ బిల్లులు భయపెడుతున్నా.. ఫోన్లో పెట్టిన ఫీచర్లు మాత్రం నెక్ట్స్ లెవల్లో ఉన్నాయని చెబుతున్నారు. బయట 5.4 అంగుళాల కవర్ డిస్ప్లే, ఫోన్ తెరిస్తే 7.6 అంగుళాల భారీ స్క్రీన్ కనిపిస్తాయి. రెండింటిలోనూ 120Hz రిఫ్రెష్ రేట్‌తో అదిరిపోయే OLED ప్యానెల్స్ వాడారు. అత్యాధునిక 2nm ప్రాసెస్‌తో వచ్చిన Apple A20 Pro చిప్సెట్, యాపిల్ జీపీయూతో ఈ ఫోన్ రాకెట్లా దూసుకుపోతుంది. సరికొత్త iOS 27తో నడిచే ఈ డివైజ్.. రోజంతా బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. వెనుక 48MP + 48MP డ్యుయల్ కెమెరాలు, సెల్ఫీ కోసం 12MP కెమెరా ఇచ్చారు. ఫీచర్లు, పర్ఫార్మెన్స్ ఎంత తోపుగా ఉన్నా.. ఒక్కసారి చేయి జారితే మాత్రం జేబు గుల్ల కావడం పక్కా అని నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫోన్ వాడాలంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే.
తాజావార్తలు
-
iPhone Duo: స్క్రీన్ పగిలితే రూ. 1.5 లక్షలు గోవిందా.. ‘ఐఫోన్ డ్యుయో’తో జర భద్రం!
-
Lenovo IdeaPad Vibe 15Q8X12: లెనోవా IdeaPad Vibe 15Q8X12 లాంచ్.. Snapdragon X ప్రాసెసర్, 15-ఇంచ్ డిస్ప్లే
-
Sri Lanka: శ్రీలంకలో తీవ్ర విద్యుత్ అంతరాయం.. నీరు, ఇంటర్నెట్ సేవలకు బ్రేక్!
-
Abhijeet Dipke: అభిజిత్ దీప్కేకు ఊరట.. షరతులతో బెయిల్..!
-
Bela Bajaria: వెయ్యి మందికి ఉద్వాసన.. ఇప్పుడు టాప్ బాస్‌పై వేటు! నెట్‌ఫ్లిక్స్‌లో ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!