Site icon NTV Telugu

iphone 17 Price Drop: ఇది కదా బాసూ ఆఫర్ అంటే.. సగం ధరకే ‘ఐఫోన్ 17’ ఫోన్!

Iphone 17 Price

Iphone 17 Price

అమెరికాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ‘యాపిల్’ నాలుగు నెలల క్రితం ఐఫోన్ 17 సిరీస్‌ను లాంచ్ చేసింది. సెప్టెంబర్ 2025లో ఐఫోన్ 17 సిరీస్‌ విడుదలైంది. ఐఫోన్‌ 17, ఐఫోన్‌ 17 ప్రో, ఐఫోన్‌ 17 ప్రోమ్యాక్స్‌లతో పాటు ఐఫోన్‌ 17 ఎయిర్‌ పేరిట సన్నని ఫోన్‌ను తీసుకొచ్చింది. అయితే ఐఫోన్‌ 17ను కొనాలని మీరు ప్లాన్ చేస్తుంటే.. ప్రస్తుతం ఒక ప్రత్యేక డీల్ ఉంది. అందుబాటులో ఉన్న ఆఫర్స్, డీల్‌లను కలిపితే మీరు ఈ హ్యాండ్‌సెట్‌ను దాదాపు సగం ధరకే సొంతం చేసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం.

టాటా అనుబంధ ఈ-కామర్స్‌ సంస్థ ‘క్రోమా’ ఆన్‌లైన్ స్టోర్‌లో ప్రస్తుతం యాపిల్ ఉత్పత్తులపై సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో ఐఫోన్ 17 (256 జీబీ)పై కూడా డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 17 ఫోన్ రూ.82,900లకు లాంచ్ అయింది. క్యాష్ బ్యాక్, ఎక్స్‌ఛేంజ్‌ బోనస్, ఎక్స్‌ఛేంజ్‌ఆఫర్ కలుపుకుని.. రూ.34,000 ఆఫర్ ఉంది. ఆఫర్స్ అనంతరం ఐఫోన్ 17 రూ.48,900కి అందుబాటులో ఉంది. అంటే ఐఫోన్ 17ను సగం ధరకే దక్కించుకోవచ్చు. ఈ అవకాశం కొన్ని రోజులే అందుబాటులో ఉంటుంది. వెంటనే కొనేసుకుంటే బెటర్.

Also Read: Samsung Galaxy S26 Ultra Launch: 200MP కెమెరా, 5400mAh బ్యాటరీ.. భారీ అప్‌గ్రేడ్స్‌తో గెలాక్సీ ఎస్26 అల్ట్రా!

ఐఫోన్ 17 ఫోన్ 6.3 ఇంచెస్ ప్రొ-మోషన్‌ డిస్‌ప్లేతో వచ్చింది. స్క్రీన్ రక్షణ కోసం సిరామిక్‌ షీల్డ్‌ 2 ఉంటుంది. 120Hz ప్రోమోషన్ రిఫ్రెష్ రేట్ ఉండటంతో స్క్రోలింగ్, వీడియోలు, గేమింగ్ అనుభవం చాలా మృదువుగా ఉంటుంది. శక్తివంతమైన యాపిల్ A19 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ iOS 26పై పనిచేస్తుంది. ఇందులోని కొత్త Apple Intelligence ఫీచర్లు యూజర్ అనుభవాన్ని మరింత స్మార్ట్‌గా మారుస్తాయి. ఐఫోన్ 17లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. రెండు సెన్సార్లు 48MP, 48MPగా ఉంటాయి. అందులో ఒకటి 120-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూను అందిస్తుంది. 18MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌ అయిదు రంగుల్లో అందుబాటులో ఉంది. టెలీ ఫొటో లెన్స్, యాపిల్‌ ఇంటెలిజెన్స్, సెంటర్‌ స్టేజ్‌ ఫ్రంట్‌ కెమేరా, ఫాస్టర్‌ వైర్డ్‌ ఛార్జింగ్‌ లాంటి ఫీచర్స్ ఈ ఫోన్ సొంతం.’

Exit mobile version