India 5G Users: భారత టెలికాం రంగం వేగంగా అభివృద్ధి చెందింది. 5జీ సేవలు ప్రారంభమై కేవలం మూడు ఏళ్లకే ఈ సాంకేతికత కోట్లాది మంది వినియోగదారుల దైనందిన జీవితంలో భాగమైంది. 5జీ విస్తరణలో భారత్ కీలక మైలురాళ్లకు చేరుకున్నట్లు ప్రభుత్వ గణాంకాలు, పరిశ్రమ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో 5జీ వినియోగదారుల సంఖ్య 40 కోట్లను దాటింది. దీంతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద 5జీ వినియోగదారుల దేశంగా భారత్ నిలిచింది. మొదటి స్థానంలో చైనా కొనసాగుతోంది. చైనాలో రూ.100 కోట్లకు పైగా 5జీ వినియోగదారులు ఉన్నారు. భారత్ తర్వాత అమెరికా, యూరోప్, జపాన్ ఉన్నాయి. ఈ సంఖ్యలు భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న 5జీ మార్కెట్లలో ఒకటిగా మారిందని సూచిస్తున్నాయి. గతంలో 2025 చివరికి దాదాపు 39.4 కోట్ల మంది వినియోగదారులు పెరుగుతారని అంచనా వేయగా.. ఆ అంచనాలను తలకిందులు చేసింది.
READ MORE: Mamata Banerjee : మా ప్రభుత్వం ఎల్లప్పుడూ వలస కూలీల కుటుంబాలకు అండగా ఉంటుంది
భారత్‌లో 5జీకి బలమైన పునాది 2022 అక్టోబర్‌లో పడింది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ 5జీ సేవలను అధికారికంగా ప్రారంభించారు. వేగవంతమైన ఇంటర్నెట్, డిజిటల్ ఇండియా లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడం దీని ప్రధాన ఉద్దేశ్యం. ఆ సమయంలో రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు 5జీలో సేవలు ప్రజల్లోకి తీసుకొచ్చాయి. టెలికాం కంపెనీలలో ముందుగా రిలయన్స్ జియో తన జియో ట్రూ 5జీ సేవలను వాణిజ్యంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ వెంటనే భారతి ఎయిర్‌టెల్ 5జీ ప్లస్ సేవలను ప్రారంభించింది. వొడాఫోన్ ఐడియా మాత్రం నిధుల సమీకరణ, నెట్‌వర్క్ అభివృద్ధి తర్వాత 2024లో 5జీ రంగంలోకి అడుగుపెట్టి, 2025లో విస్తరణకు ప్రణాళికలు వేసింది. ఈ క్రమంలో కొత్త టవర్లు, ఫైబర్ నెట్‌వర్క్, ఆధునిక సాంకేతిక వ్యవస్థలపై కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. భారత్‌లో 5జీ వేగంగా విస్తరించడానికి ప్రధాన కారణం అందుబాటు ధరలే. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో మొబైల్ డేటా ఖర్చు చాలా తక్కువ. 5జీ సేవలకూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఇటీవల ధరలు కొంత పెరిగినా, పెద్ద దేశాల్లో భారత్ డేటా చౌకగా లభించే దేశంగానే ఉంది.
READ MORE: Anasuya: అనసూయపై కామెంట్స్..జర్నలిస్టులు సహా 72 మందిపై కేసు
