మనిషి కంట్రోల్ చేయగలిగిన రోబోట్ లను మనం చూసే ఉంటాం. ప్రస్తుతం తనకు తాను ఓ మనిషిలా ఆలోచించి… నిర్ణయం తీసుకునే రోబో గురించి మీకు తెలుసా. అయితే.. చైనాలోని తియాంజిన్ యూనివర్సిటీ, సదరన్ యూనివర్సటీకి చెందిన సైంటిస్ట్ లు ఈ సరికొత్త రోబోను అభివృద్ధి చేశారు. మానవ స్టెమ్ సెల్స్ ను ఉపయోగించి తయారు చేసిన మొదడును దీనికి సెట్ చేశారు. దీంతో ఇది సొంతంగా ఆలోచించి.. నిర్ణయం తీసుకుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Read Also:Side Effects: బంగాళాదుంపలు ఎక్కువగా తింటున్నారా.. అయితే బీకేర్ ఫుల్…
ఈ రోబోట్ కు రెండు చేతులు, రెండు కాళ్లతో పాటు బ్రెయిన్ కూడా అమర్చారు. మానవ స్టెమ్ సెల్స్‌ను ల్యాబ్‌లో పెంచి, చిన్న బ్రెయిన్ టిష్యూ తయారు చేశారు. ఇది న్యూరాన్స్ తో సజీవంగా ఉంటుందని… శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ టిష్యూను ఓ స్పెషల్ న్యూరల్ చిప్ తో కనెక్ట్ చేసి.. రోబోను కంట్రోల్ చేసే విధంగా డెవలప్ చేశామన్నారు. దీనిని ‘మెటా-బ్రెయిన్ రోబోట్’ లేదా ‘బ్రెయిన్-ఆన్-చిప్ రోబో’గా పిలుస్తున్నారు.
Read Also:Premi Viswanath: భర్తకు దూరమైపోతున్నా.. వంటలక్క షాకింగ్ కామెంట్స్
స్టెమ్ సెల్ తో మెదడు టిష్యూ తో ఇది.. సమాచారాన్ని తీసుకుని నడవడం.. వివిధ అడ్డంకులను తప్పించడం.. వస్తువులను క్యాచ్ చేస్తుందని చెబుతున్నారు చైనా శాస్త్రవేత్తలు. ఇది మెదడుతో అన్ని విషయాలు నేర్చుకుంటుందన్నారు. అయితే.. ఇది ఇప్పటికి ప్రారంభ దశలోనే ఉందన్నారు. ఈ సరికొత్త ఆవిష్కరణ బయో రోబోటిక్స్ రంగంలో గొప్ప మైలురాయిగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
