ఫోల్డబుల్ ఫోన్లను కొనేందుకు స్మార్ట్ ఫోన్ లవర్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తు్న్నారు. బడ్జెట్ ధరల్లోనే లభిస్తుండడంతో డిమాండ్ పెరిగింది. ఇప్పటికే మొబైల్ తయారీ సంస్థలు అదిరిపోయే ఫీచర్లతో ఫోల్డబుల్ ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. మరి మీరు కూడా కొత్త ఫోల్డబుల్ ఫోన్ ను కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ లో అదిరిపోయే డీల్ అందుబాటులో ఉంది. TECNO Phantom V Flip 5G మొబైల్ పై 64శాతం డిస్కౌంట్ లభిస్తోంది. రూ. 72 వేలు విలువ చేసే ఫోల్డబుల్ మొబైల్ ను రూ. 26 వేలకే సొంతం చేసుకోవచ్చు.
అమెజాన్ లో TECNO Phantom V Flip 5G ఫోన్ అసలు ధర రూ. 71,999గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 25,999కే దక్కించుకోవచ్చు. ఫోల్డబుల్ ఫోన్ పై ఇంతకంటే బెస్ట్ డీల్ మళ్లీరాదేమో ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. Tecno Phantom v Flip 5G ఫోన్ 8GB+256GB స్టోరేజీతో వస్తుంది. ఇది ఐకానిక్ బ్లాక్, మిస్టిక్ డాన్ కలర్స్ లో అందుబాటులో ఉంది. 6.9 అంగుళాల ఫుల్ HD+ ఫ్లెక్సిబుల్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.
సర్క్యూలర్ AMOLED డిస్‌ప్లే 1.32 అంగుళాలతో వస్తోంది. ఇందులో మీడియాటెక్ 8050 ప్రాసెసర్ అమర్చారు. ఆండ్రాయిడ్ 13.0 వర్షన్‌తో పనిచచేస్తుంది. కెమెరా విషయానికి వస్తే.. బ్యాక్ కెమెరా 64MP, 13MP వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా సెటప్‌తో వస్తోంది. ఫ్రంట్ కెమెరా 32MPతో వస్తోంది. వైఫై, బ్లూటూత్ 5.1 వర్షన్, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4000mAh బ్యాటరీ కెపాసిటీ కలిగి ఉంది.