బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లు బడ్జెట్ ధరలోనే అందుబాటులో ఉంటున్నాయి. సేల్స్ ను పెంచుకునేందుకు కంపెనీలు తక్కువ ధరలోనే స్మార్ట్ ఫోన్లను అందుబాటులో ఉంచుతున్నాయి. కంపెనీల మధ్య పోటీతో చౌక ధరలోనే 5G ఫోన్లు లభిస్తున్నాయి. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లవర్స్ కు అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ లో రెడ్ మీకి చెందిన రెడ్‌మీ Note 13 Pro 5Gపై కళ్లు చెదిరే డీల్ అందుబాటులో ఉంది. ఏకంగా రూ. 10 వేల డిస్కౌంట్ అందుబాటులో ఉంది. మతిపోగొట్టే ఫీచర్లు కావాలనుకునే వారు ఈ ఫోన్ పై ఓ లుక్కేయండి.
రెడ్‌మీ Note 13 Pro 5G ఫోన్ 8GB + 256GB వేరియంట్ స్కార్లెట్ రెడ్ ఎడిషన్ లో అందుబాటులో ఉంది. అమెజాన్ లో ఈ ఫోన్ పై 34 శాతం డిస్కౌంట్అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 29,990గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 19,795కే దక్కించుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లను యూజ్ చేసుకుని కొనుగోలు చేస్తే మరింత తగ్గింపు లభిస్తుంది. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 1800 nits పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది.
Redmi Note 13 Pro 5G Qualcomm Snapdragon 7s Gen 2 SoCని కలిగి ఉంది. Android 13 OS బేస్‌డ్ HyperOS కస్టమ్ స్కిన్ అవుట్ ఆఫ్ ది బాక్స్‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్ 5,100mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 67W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో వెనక వైపు 200 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్ అందించారు. సెల్ఫీల కోసం 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. వాటర్,డస్ట్ ప్రొటక్షన్ కోసం IP54 రేటింగ్, బ్లూటూత్ 5.2, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.