NTV Telugu Site icon

Amazon Great Republic Day Sale 2025: న్యూ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా?.. ఐకూ ఫోన్లపై వేలల్లో డిస్కౌంట్!

Iqoo Copy

Iqoo Copy

ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ లో గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ప్రారంభమైంది. ఈ సేల్ నిన్న జనవరి 13 నుంచి ప్రారంభమైంది. జనవరి 19 వరకు కొనసాగుతుంది. ఈసేల్ లో భాగంగా తమ ప్రొడక్ట్స్ పై భారీ డిస్కౌంట్స్ ను అందిస్తోంది. స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ వాచ్ లు, స్మార్ట్ గాడ్జెట్స్, హోమ్ అప్లియెన్సెస్ వంటి వాటిపై ఆఫర్ల వర్షం కురిపించింది. ఈ సేల్ లో ఐకూ బ్రాండ్ కు చెందిన స్మార్ట్ ఫోన్లపై వేలల్లో తగ్గింపు ప్రకటించింది. iQOO 12, iQOO Neo 9 ప్రో, iQOO Z9 Lite, iQOO Z9x, iQOO Z9s, iQOO Z9s Proలపై బంపరాఫర్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నట్లైతే ఈ ఐకూ స్మార్ట్ ఫోన్లపై ఓ లుక్కేయండి.

iQOO Z9 Lite 5G:

అమెజాన్ లో ఈ ఫోన్ పై 28 శాతం డిస్కౌంట్ ఉంది. దీని అసలు ధర రూ. 14,499గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 10,499కే దక్కించుకోవచ్చు. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అండ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ తో కొనుగోలు చేస్తే అదనంగా రూ.1250 తగ్గుతుంది. అంటే అప్పుడు మీకు రూ. 9249కే ఈ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ 4GB RAM, 128GB స్టోరేజ్ తో వస్తుంది. 50MP Sony AI కెమెరాను అందించారు. MediaTek Dimension 6300 చిప్‌సెట్ తో వస్తుంది. 5000mAh బ్యాటరీతో 15W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ తో వస్తుంది.

iQOO Z9x 5G:

ఈ ఫోన్ పై 29 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 18,999గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 13499కే దక్కించుకోవచ్చు. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ సాయంతో కొనుగోలు చేస్తే రూ. 1,500 డిస్కౌంట్ తో రూ. 11999కే వచ్చేస్తోంది. ఈ ఫోన్ 6GB RAM, 128GB స్టోరేజ్ తో వస్తుంది. 6.72-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ లో Snapdragon 6 Gen 1 ప్రాసెసర్ ను అమర్చారు. ఈ ఫోన్ 6000mAh అల్ట్రా స్లిమ్ బ్యాటరీని కలిగి ఉంది. 44W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది. ఫోటోగ్రఫీ కోసం, ఫోన్‌లో 50MP ప్రధాన కెమెరా, 2MP సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంది.

iQOO నియో 9 ప్రో:
ఈ ఫోన్ పై 20 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 44,999గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 35,999కే సొంతం చేసుకోవచ్చు. iQOO Neo 9 Pro 50MP IMX 920 ప్రైమరీ సెన్సార్ మరియు OIS మద్దతుతో 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీల కోసం ఫోన్‌లో 16MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. 5,160mAh బ్యాటరీని కలిగి ఉంది. దీనిలో Snapdragon 8 Gen 2 చిప్‌సెట్‌ను అమర్చారు. 12GB RAM, 256GB స్టోరేజ్ తో వస్తుంది.

iQOO Z9s:

ఈ ఫోన్ పై 23 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 25,999గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 19,998కే సొంతం చేసుకోవచ్చు. ఈ iQOO ఫోన్‌ను రూ. 2000 రిపబ్లిక్ డే డిస్కౌంట్ తర్వాత రూ. 17,999కి కొనుగోలు చేయవచ్చు. MediaTek Dimension 7300 ప్రాసెసర్ అమర్చారు. ఇది 50MP Sony IMX882 కెమెరాతో వస్తుంది. 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,500mAh బ్యాటరీని కలిగి ఉంది. 8GB RAM, 128GB స్టోరేజ్ తో వస్తుంది. 120 Hz 3D Curved AMOLED Display ను అందించారు.

Show comments