NTV Telugu Site icon

InnoQ Spectra Smart TV: రూ. 30 వేల స్మార్ట్ టీవీ కేవలం రూ. 7 వేలకే.. లేట్ చేయకండి

Tv

Tv

మార్కెట్ లో స్మార్ట్ టీవీలకు కొదవ లేదు. ప్రముఖ కంపెనీలన్నీ అదిరిపోయే ఫీచర్లతో టీవీలను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. కంపెనీల మధ్య పోటీతో స్మార్ట్ టీవీలు తక్కువ ధరలోనే అందుబాటులో ఉంటున్నాయి. అంతేకాదు సేల్స్ ను పెంచుకునేందుకు బంపరాఫర్లను ప్రకటిస్తున్నాయి. ఏకంగా వేలల్లో డిస్కౌంట్ అందిస్తున్నాయి. మీరు ఈ మధ్యకాలంలో కొత్త స్మార్ట్ టీవీని కొనాలని చూస్తున్నారా? అయితే మీకు ఇదే మంచి ఛాన్స్. ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో InnoQ Spectra Smart TV భారీ తగ్గింపు ప్రకటించింది. రూ. 30 వేల స్మార్ట్ టీవీ కేవలం రూ. 7 వేలకే వచ్చేస్తోంది.

Also Read:Off The Record : మనల్ని వాడుకొని వదిలేశాయి.. జీవన్ రెడ్డి ట్రెండింగ్ లో ఉండాలనుకుంటున్నారా.?

InnoQ Spectra 80 cm (32 inch) HD Ready LED Smart Android TVపై ఫ్లిప్ కార్ట్ లో 75 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 29,990గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 7490కే సొంతం చేసుకోవచ్చు. అంటే మీకు రూ. 22,500 సేవ్ అవుతుందన్నమాట. స్మా్ర్ట్ టీవీపై ఇంతకంటే బెస్ట్ డీల్ ఉండదేమో. సూపర్ ఫీచర్లతో వస్తున్న ఈ టీవీపై ఓ లుక్కేయండి. 30W బూమ్ స్పీకర్లతో వస్తుంది. 1000+ స్మార్ట్ యాప్స్ – గేమ్స్, మొబైల్ స్క్రీన్ కనెక్ట్, పిక్సెల్ ఎన్‌హాన్సర్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ+హాట్‌స్టార్, యూట్యూబ్ వంటి యాప్స్ కు సపోర్ట్ చేస్తుంది. ఫ్రేమ్ లెస్ డిస్ల్పేతో వస్తుంది.