NTV Telugu Site icon

Acer Aspire 3: రూ. 50 వేల ల్యాప్ టాప్ రూ. 30 వేలకే.. లేట్ చేయకండి

Acer

Acer

కరోనా అనంతరం ల్యాప్ టాప్ ల వినియోగం పెరిగింది. ఆన్ లైన్ క్లాస్ ల కోసం, వర్క్ ఫ్రం హోం కోసం, ఆఫీస్ వర్క్స్ కోసం ల్యాప్ టాప్ లు వాడుతున్నారు. ఆన్ లైన్ లో రకరకాల ల్యాప్ టాప్ లు అందుబాటులో ఉన్నాయి. లేటెస్ట్ ఫీచర్లు, మంచి పనితీరుతో తక్కువ ధరలోనే ల్యాప్ టాప్ లు లభిస్తున్నాయి. మీరు కొత్త ల్యాప్ టాప్ కొనాలనే ప్లాన్ లో ఉంటే ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో క్రేజీ డీల్ అందుబాటులో ఉంది. టెక్ బ్రాండ్ ఏసర్ కు చెందిన ల్యాప్ టాప్ Acer Aspire 3 Intel Core i3 13th Gen 1305U పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది.

Acer Aspire 3 Intel Core i3 13th Gen 1305Uల్యాప్ టాప్ పై 40 శాతం తగ్గింపు లభిస్తోంది. దీని అసలు ధర రూ. 49,999గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 29,990కే సొంతం చేసుకోవచ్చు. 14 అంగుళాల స్క్రీన్ తో IPS డిస్ల్పేతో వస్తుంది. 1.45కేజీల బరువు కలిగి ఉంది. ఇది తిన్ అండ్ లైట్ ల్యాప్ టాప్. ప్రతి రోజు ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుంది. 8 GB ర్యామ్/512 GB SSD/ ఆపరేటింగ్ సిస్టమ్ Windows 11 Home తో వస్తుంది.

1920 x 1080 Pixel స్క్రీన్ రెసొల్యూషన్ ను కలిగి ఉంది. డిజిటల్ మైక్రోఫోన్స్, స్టీరియో స్పీకర్స్, వెబ్ క్యామ్ లను అందించారు. బ్లూటూత్, వైఫై కనెక్టివిటీతో వస్తుంది. 2 x USB 3.2 port, 1 x USB 2.0 port, PD Adapter కోసం 1 x Type-C port అందించారు. ఇందులోని అదనపు ఫీచర్ US లాంగ్వేజ్ తో 84-కీల Acer కీబోర్డ్ లేఅవుట్ అందించారు. తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్లు కలిగిన ల్యాప్ టాప్ కావాలనుకునే వారు ఈ ల్యాప్ టాప్ పై ఓ లుక్కేయండి.