AMOLED డిస్‌ప్లే, 10 రోజుల బ్యాటరీతో హువావే HUAWEI WATCH FIT 5 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!

Huawei Watch Fit 5

Huawei Watch Fit 5

HUAWEI WATCH FIT 5 Launch: హువాయే (HUAWEI) కామపీనీ కొత్తగా స్మార్ట్‌వాచ్‌ల సిరీస్ HUAWEI WATCH FIT 5 అండ్ HUAWEI WATCH FIT 5 Proలను అధికారికంగా లాంచ్ చేసింది. గత ఏడాది వచ్చిన FIT 4 సిరీస్‌కు సక్సెసర్‌గా ఈ కొత్త మోడళ్లు మెరుగైన డిజైన్, పెద్ద డిస్‌ప్లేలు, ఆధునిక ఫిట్‌నెస్, హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లతో వచ్చాయి. మరి వీటి ప్రత్యేకలేంటో ఒకసారి చూసేద్దామా..

డిజైన్ & డిస్‌ప్లే:
WATCH FIT 5లో 1.82 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉండగా.. WATCH FIT 5 Proలో 1.92 అంగుళాల పెద్ద స్క్రీన్ అందించారు. ఇంకా Pro వేరియంట్‌లో అల్ట్రా న్యారో బెజెల్స్‌ తో వీటికి ప్రీమియం లుక్ కనిపిస్తుంది. ఈ రెండు మోడళ్లలోనూ 3000 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ ఉండటం వల్ల ఎండలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. వీటి కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే.. FIT 5లో సిల్వర్, పర్పుల్, వైట్, బ్లాక్, గ్రీన్ వంటి రంగులు ఉండగా.. Pro వేరియంట్‌లో సన్‌సెట్ ఆరెంజ్, గ్లేసియర్ వైట్, బ్లాక్ కలర్స్ ఉన్నాయి. Pro మోడల్‌లో నానో-సెరామిక్ మెటల్ ఫినిష్ ఉన్నాయి.

Novak Djokovic: కోహ్లీ వల్లే నేను క్రికెట్ ను ఆస్వాదిస్తున్నా.. త్వరలోనే భారత్‌కు వస్తాను.!

ఫిట్‌నెస్ & యాక్టివిటీ ట్రాకింగ్:
ఈ సిరీస్‌లో 100కి పైగా వర్కౌట్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా మైక్రో-మూవ్మెంట్ ఫీచర్ ద్వారా తక్కువ సమయంలో చిన్న చిన్న వ్యాయామాలను సూచిస్తుంది. సైక్లింగ్ కోసం ఆటోమేటిక్ ట్రాకింగ్, రియల్‌టైమ్ డేటా అందిస్తుంది. Pro వేరియంట్‌లో ట్రైల్ రన్నింగ్ కోసం అడ్వాన్స్‌డ్ నావిగేషన్, ఆల్టిట్యూడ్ ట్రాకింగ్, ఫినిష్ ప్రిడిక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. గోల్ఫ్ ప్రేమికుల కోసం ప్రపంచవ్యాప్తంగా 17,000కిపైగా కోర్సుల మ్యాప్స్ కూడా ఇందులో ప్రత్యేకంగా అందించారు.

హెల్త్ ఫీచర్లు:
హార్ట్ రేట్, టెంపరేచర్, బాడీ మానిటరింగ్ వంటి ఫీచర్లతో పాటు Pro మోడల్‌లో ECG, అట్రియల్ ఫైబ్రిలేషన్ అలర్ట్స్, వాస్క్యులర్ ఎలాస్టిసిటీ డిటెక్షన్ వంటి అధునాతన ఆరోగ్య ఫీచర్లు ఉన్నాయి. మహిళల ఆరోగ్య ట్రాకింగ్ కోసం ఓవులేషన్ సైకిల్ అంచనాలు కూడా అందిస్తాయి.

Genelia D’Souza: స్టేజి పైనే వెక్కి వెక్కి ఏడ్చిన హా.. హా.. హాసిని.! వీడియో వైరల్..

బ్యాటరీ:
ఈ స్మార్ట్‌వాచ్‌లు ఒకసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 10 రోజుల వరకు పనిచేస్తాయని కంపెనీ పేర్కొంది. సాధారణ వినియోగంలో 7 రోజుల బ్యాటరీ లైఫ్ లభిస్తుంది. మాగ్నెటిక్ చార్జింగ్ సపోర్ట్ కూడా దీనికి ఉంది. ఇక ఇందులో బ్లూటూత్ కాలింగ్, GPS సపోర్ట్, NFC, 5ATM వాటర్ రెసిస్టెన్స్, IP6X డస్ట్ ప్రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే మ్యూజిక్ కంట్రోల్, కెమెరా కంట్రోల్, వాచ్ ఫేస్ కస్టమైజేషన్ వంటి స్మార్ట్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ధర:
WATCH FIT 5 ధర రూ.15,000 నుంచి ప్రారంభమవుతుంది. Pro వేరియంట్ ధర రూ.28,700 నుంచి మొదలవుతుంది. ఈ స్మార్ట్‌వాచ్‌లు ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉండగా, ఏప్రిల్ 29 నుంచి అధికారికంగా అమ్మకాలు ప్రారంభమవుతాయి. Pro మోడల్ మే 15 నుంచి మార్కెట్లోకి రానుంది.