HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max: హువావే (HUAWEI) నుండి పుర 90s (Pura 90s) సిరీస్ స్మార్ట్‌ఫోన్లను గ్లోబల్ మార్కెట్‌లో అధికారికంగా లాంచ్ చేసింది. మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరిగిన ప్రత్యేక ఈవెంట్‌లో HUAWEI Pura 90s Pro, HUAWEI Pura 90s Pro Max మోడళ్లను లాంచ్ చేసింది. Kirin 9030S ప్రాసెసర్, LTPO OLED డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ, AI ఆధారిత కెమెరా ఫీచర్లు, IP69 రేటింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో ఈ ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి.
HUAWEI Pura 90s Pro:
HUAWEI Pura 90s Proలో 6.6 అంగుళాల LTPO OLED డిస్‌ప్లేను అందించారు. ఇది 1-120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 1.07 బిలియన్ కలర్స్, హై ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌కు Kirin 9030S ఆక్టా-కోర్ ప్రాసెసర్, 12GB ర్యామ్, 256GB/512GB స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. ఫోటోగ్రఫీ కోసం 50MP ప్రధాన కెమెరా, 12.5MP అల్ట్రా వైడ్ కెమెరా, 50MP టెలిఫోటో మాక్రో కెమెరాను అందించారు. 4x ఆప్టికల్ జూమ్, 100x డిజిటల్ జూమ్, OIS సపోర్ట్, 4K వీడియో రికార్డింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సెల్ఫీల కోసం 13MP ఆటోఫోకస్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. ఇంకా ఇందులో 6000mAh బ్యాటరీ, 66W వైర్డ్ సూపర్‌ఛార్జ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.
HUAWEI Pura 90s Pro Max:
Pura 90s Pro Maxలో 6.9 అంగుళాల LTPO OLED డిస్‌ప్లేను అందించారు. ఇది కూడా 1-120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇందులో 12GB ర్యామ్, 512GB స్టోరేజ్, EMUI 16 ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నాయి. ఈ ఫోన్‌లో హైలెట్ 200MP అల్ట్రా లార్జ్ సెన్సార్ టెలిఫోటో కెమెరా. దీనికి 50MP ప్రధాన కెమెరా, 40MP అల్ట్రా వైడ్ కెమెరా జతయ్యాయి. 4x ఆప్టికల్ జూమ్, 100x డిజిటల్ జూమ్, AI కెమెరా ఫీచర్లు, త్రు-టు-కలర్ Camera 2.0, AI Composition, AI De-glare, AI Move వంటి స్మార్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అలాగే ఇందులో హువావే కొత్త Kunlun గ్లాస్ ను ఉపయోగించింది. దీని వల్ల లైట్ రిఫ్లెక్షన్ 70% వరకు తగ్గుతుంది. ఇంకా స్క్రాచ్ రెసిస్టెన్స్ 16 రెట్లు మెరుగుపడుతుంది. అలాగే పడిపోయినా దెబ్బతినే అవకాశాలు 25 రెట్లు తగ్గుతాయి. యాంటీ-ఫింగర్‌ప్రింట్ కోటింగ్ ఎక్కువకాలం నిలుస్తుంది.
An orange ocean in the palm of your hand. Let the colours dance on the HUAWEI Pura90s Pro Max. pic.twitter.com/cg4Ig3yiAs
— Huawei (@Huawei) July 13, 2026
రెండు ఫోన్లలోనూ Celia AI అసిస్టెంట్ అందుబాటులో ఉంది. ఇది రూట్ సూచనలు, షెడ్యూల్ మేనేజ్‌మెంట్, వాయిస్ కమాండ్స్, రోజువారీ ప్రశ్నలకు సమాధానాలు, AI కెమెరా సహాయం వంటి సేవలను అందిస్తుంది. రెండు ఫోన్లకు IP68, IP69 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్స్ ఉన్నాయి. అలాగే Wi-Fi 7, బ్లూటూత్ 6.0, USB టైపు-C, NFC, NearLink E2.0, డ్యూయల్ సిమ్, 5G కనెక్టివిటీ, GPS, NavIC, స్టీరియో స్పీకర్లు వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.
ధరలు:
ప్రస్తుతం ఈ ఫోన్లు మలేషియాలో ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో కూడా వీటి అమ్మకాలకు ప్రారంభం కానున్నాయి. వీటి ధరలు ఇలా ఉన్నాయి.
HUAWEI Pura 90s Pro:
* 12GB + 256GB – RM 3,699 (రూ.87,270).
* 12GB + 512GB – RM 3,999 (రూ.94,345).
HUAWEI Pura 90s Pro Max:
* 12GB + 512GB – RM 4,899 (రూ.1,15,580).

