Honor X8e 4G: హానర్ X8e 4G లాంచ్.. 108MP కెమెరా, 7,700mAh బ్యాటరీతో కొత్త స్మార్ట్‌ఫోన్!

Honor X8e 4g

Honor X8e 4g

Honor X8e 4G Launched: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో హానర్ (Honor) కంపెనీ X సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. Honor X8e 4G పేరుతో పరిచయం చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో 108MP ప్రైమరీ కెమెరా, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, భారీ 7,700mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా, ఫోన్‌కు దుమ్ము, నీటి నుంచి రక్షణ కల్పించే రేటింగ్స్ కూడా ఉన్నట్లు కంపెనీ వివరాల్లో పేర్కొన్నారు. ఈ ఫోన్ ధర ఎంత? ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Honor X8e 4G స్మార్ట్‌ఫోన్ 6GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్‌లో అందుబాటులోకి వచ్చింది. అజర్‌బైజాన్‌లో దీని ధర AZN 688 నుంచి AZN 820 వరకు ఉంది. భారత కరెన్సీలో సుమారు రూ.35,000 నుంచి రూ.42,000 వరకు అవుతుంది. అయితే, ఇవి కేవలం కరెన్సీ మార్పిడి ఆధారంగా లెక్కించిన అంచనా ధరలు మాత్రమే. ఈ స్మార్ట్‌ఫోన్ Sunrise Orange, Desert Gold, Velvet Black రంగుల్లో కనిపించింది.

ఈ ఫోన్‌లో 6.87 అంగుళాల TFT LCD డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. డిస్‌ప్లే గరిష్ఠ బ్రైట్‌నెస్ 1,020 నిట్స్ వరకు ఉంటుంది. ఫోన్‌లో Qualcomm Snapdragon 685 ప్రాసెసర్‌తో పాటు Adreno 610 GPU ఉన్నాయి.

Honor X8e 4Gలో 108MP ప్రైమరీ రియర్ కెమెరా అందించారు. ఈ కెమెరాకు f/1.75 అపర్చర్ ఉంది. ఫోన్ వెనుక భాగంలో మరో కెమెరా లెన్స్ కూడా అందించారు. కెమెరాతో 1080p రిజల్యూషన్‌లో వీడియో రికార్డింగ్ చేయవచ్చు. అలాగే 8x డిజిటల్ జూమ్ సపోర్ట్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 5MP కెమెరాను అందించారు. ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణగా 7,700mAh బ్యాటరీ. ఫోన్‌లో 45W Honor SuperCharge వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. Honor X8e 4Gలో AI Image to Video 2.0 ఫీచర్ అందించారు. దీనితో పాటు AI టూల్స్‌ను త్వరగా యాక్సెస్ చేసేందుకు ప్రత్యేక AI బటన్ కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు IP68, IP69, IP69K రేటింగ్‌లు ఉంది.