ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ హానర్ ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫీచర్స్ కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తుంటారు.. అదిరిపోయే ఫీచర్స్ తో పాటుగా సరసమైన ధరలతో మార్కెట్ లోకి విడుదల అవుతున్నాయి.. తాజాగా హానర్ నుంచి సరికొత్త హానర్ ఎక్స్8బీ ఎంపిక చేసిన మార్కెట్‌లలో లాంచ్ అయింది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 680ఎస్ఓసీ ద్వారా ఆధారితమైనది.. ఈ ఫోన్ ఫీచర్స్, ధర ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ సరికొత్త మొబైల్స్ 6.7-అంగుళాల పూర్తి-హెచ్‌డీ+ (2,412 x 1,080 పిక్సెల్‌లు) ఎమోఓఎల్ఈడీ డిస్‌ప్లే 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ రేట్ 3,240హెచ్‌జెడ్, గరిష్ట ప్రకాశం స్థాయి 2వేల నిట్‌లను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 13-ఆధారిత మ్యాజిక్ఓఎస్ 7.2తో షిప్ అవుతుంది..హానర్ ఎక్స్8బీ ఫోన్ 35డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తుంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.
ఈ 4జీ వోల్ట్, వై-ఫై 802.11ఎసి, బ్లూటూత్ 5.0, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సి కనెక్టివిటీకి కూడా సపోర్టు ఇస్తుంది. సుమారు 166 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.. 3హానర్ ఎక్స్8బీ ఫోన్ ధర ఎస్ఓఆర్ 799 (దాదాపు రూ. 17,700) సౌదీ అరేబియాలో 8జీబీ+ 512జీబీ వేరియంట్ మలేషియాలో ఆర్ఎమ్ 999 (దాదాపు రూ. 17,700) ఉంటుంది. హానర్ ధరను ప్రకటించనప్పటికీ.. 8జీబీ + 128జీబీ 8జీబీ + 256జీబీ కాన్ఫిగరేషన్‌లలో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ స్టోరేజీ ఆప్షన్లలో ఇతర మార్కెట్‌లలో ఫోన్ దొరకదని నిపుణులు అంచనా వేస్తున్నారు.. మరెన్నో ఫీచర్స్ ను కలిగి ఉంటుంది..