NTV Telugu Site icon

Honor X7b Launch : హానర్ నుంచి మరో స్మార్ట్ ఫోన్.. సెల్ఫీ ప్రియులకు పండగే పండగ.. ధర ఎంతంటే?

Honor

Honor

ప్రముఖ చైనా కంపెనీ హానర్ అదిరిపోయే ఫీచర్స్ తో మరో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి వదిలింది.. ఈ ఫోన్ ఫీచర్స్ జనాలను తెగ ఆకట్టుకుంటున్నాయని తెలుస్తుంది.. హానర్ ఎక్స్7బీ లేటెస్ట్ సరసమైన స్మార్ట్‌ఫోన్‌గా లాంచ్ అయింది.. ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 680 చిప్‌సెట్ ద్వారా ఆధారితమైనది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా మ్యాజిక్ఓఎస్ 7.2పై రన్ అవుతుంది.అలాగే 6.8-అంగుళాల ఎల్‌సీడీ స్క్రీన్‌ను కలిగి ఉంది. 108ఎంపీ ప్రైమరీ కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. హానర్ ఎక్స్7బీ గరిష్టంగా 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీతో అందుబాటులో ఉంది.

ఫీచర్స్ విషయానికొస్తే… ఇది ఆండ్రాయిడ్ 13-ఆధారిత మ్యాజిక్ఓఎస్ 7.2 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ అవుతుంది. 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.8-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ (1,080×2,412 పిక్సెల్‌లు) టీఎఫ్‌టీ ఎల్‌సీడీ డిస్‌ప్లేను కలిగి ఉంది..8జీబీ వరకు ర్యామ్‌తో ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 680 చిప్ ద్వారా పవర్ అందిస్తుంది. ఫోటోలు, వీడియోలకు హానర్ ఎక్స్7బీ 108ఎంపీ ప్రైమరీ కెమెరాతో ఎఫ్/1.75 ఎపర్చరుతో, 5ఎంపీ వైడ్ యాంగిల్-కెమెరాతో ఎఫ్/2.2 ఎపర్చరుతో 2ఎంపీ డెప్త్ సెన్సార్ ఎఫ్‌/2.4తో ఎపర్చరు వస్తుంది.. అలాగే 4జీ ఎల్‌టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ (మోడల్) ఉన్నాయి..ఈ ఫోన్ 35డబ్ల్యూ హానర్ సూపర్‌ఛార్జ్ సపోర్ట్‌తో 6,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది.. దీని బరువు విషయానికొస్తే.. 199గ్రాములు ఉంటుంది.

ఇక ధరను చూస్తే.. హానర్ ఎక్స్7బీ ఫోన్ ధర 249 డాలర్లుగా నిర్ణయించింది. ఈ హ్యాండ్‌సెట్ ఎమరాల్డ్ గ్రీన్, ఫ్లోయింగ్ సిల్వర్, మిడ్‌నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.. ఇండియా మార్కెట్ లో ఈ ధరల గురించి అసలు ప్రకటించలేదు.. ఇక్కడ లాంచ్ చేస్తుందా లేదా అన్నది చూడాలి..

Show comments