10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్‌ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • హానర్ విన్ ట్యాబ్లెట్ చైనాలో లాంచ్
  • 8.4 అంగుళాల 2.3K OLED డిస్‌ప్లేతో ట్యాబ్లెట్
  • 240Hz రిఫ్రెష్ రేట్, 6,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
  • స్నాప్‌డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్
  • 10,000mAh భారీ బ్యాటరీ, 66W ఫాస్ట్ ఛార్జింగ్..
Honor Win Tablet

Honor Win Tablet

HONOR WIN Tablet Launched: హానర్ సంస్థకు సంబంధించిన విన్ (WIN) సిరీస్ ఫోన్లతో పాటు కొత్త హానర్ విన్ ట్యాబ్లెట్ (HONOR WIN Tablet‌)ను చైనాలో విడుదల చేసింది. గేమింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ట్యాబ్లెట్‌లో 2.3K OLED డిస్‌ప్లే, 240Hz రిఫ్రెష్ రేట్, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 ప్రాసెసర్, 10,000mAh భారీ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఈ కొత్త ట్యాబ్లెట్‌లో 8.4 అంగుళాల OLED డిస్‌ప్లేను అందించారు. ఇది 2304×1440 పిక్సెల్స్ రిజల్యూషన్, 324 PPI, 93% స్క్రీన్-టు-బాడీ రేషియోతో వస్తుంది. 240Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 185Hz, 165Hz, 120Hz, 90Hz, 60Hz మోడ్‌లకు కూడా సపోర్ట్ ఉంది. 40కి పైగా గేమ్స్‌లో 240Hz రిఫ్రెష్ రేట్‌ను వినియోగించుకోవచ్చు. పీక్ బ్రైట్‌నెస్ 6,000 నిట్స్ వరకు ఉంటుంది. పెర్ఫార్మెన్స్ కోసం స్నాప్ డ్రాగన్ 8 Elite Gen 5 3nm మొబైల్ ప్లాట్‌ఫామ్, Adreno 840 GPUను ఉపయోగించారు. హీట్ కంట్రోల్ కోసం డ్యూయల్ VC సింక్రోనస్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ ఉంది. గేమింగ్ సమయంలో హ్యాప్టిక్ ఫీడ్‌బ్యాక్ కోసం డ్యూయల్ X-యాక్సిస్ లీనియర్ వైబ్రేషన్ మోటార్లు అందించారు.

ఇందులో 10,000mAh బ్యాటరీ ఉంది. ఇది 66W ఫాస్ట్ ఛార్జింగ్, 27W రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. బైపాస్ ఛార్జింగ్ ఫీచర్ ద్వారా బ్యాటరీని నేరుగా ఛార్జ్ చేయకుండా పవర్ ఇన్‌పుట్‌తో ట్యాబ్లెట్‌ను నడపవచ్చు. దీంతో గేమింగ్ సమయంలో బ్యాటరీపై వేడి ఒత్తిడి తగ్గుతుంది. గేమర్ల కోసం ‘Geek Center’ అనే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అందించారు. దీని ద్వారా డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్, మెమరీ స్కాన్ సైజ్, లో-బ్యాటరీ ప్రొటెక్షన్ వంటి సెట్టింగ్‌లను కస్టమైజ్ చేసుకోవచ్చు. ‘Full Throttle’ మోడ్ ద్వారా గరిష్ఠ పనితీరును పొందే అవకాశం ఉంది.

కెమెరాల విషయానికి వస్తే 13MP ఆటోఫోకస్ రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. Android 17 ఆధారిత MagicOS 11తో పనిచేస్తుంది. Wi-Fi 7, Bluetooth 6.0, USB Type-C కనెక్టివిటీ కూడా ఉన్నాయి. ధర విషయానికి వస్తే 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర 4,499 యువాన్లు (USD 673 / రూ.63,650)గా ఉంది. 16GB RAM + 512GB వేరియంట్ ధర 5,499 యువాన్లు (USD 823 / రూ.77,795)గా నిర్ణయించారు. చైనాలో అక్టోబర్ 31 నుంచి సేల్ మొదలు కానుంది.