Site icon NTV Telugu

ఎన్నో స్మార్ట్ ఫోన్స్ చూశాం కానీ.. రాబోయే HONOR Robot Phone వేరే లెవెల్ అంతే.! వీడియో వైరల్..

Honor Robot Phone

Honor Robot Phone

HONOR Robot Phone: తాజాగా చైనాలో జరిగిన హానర్ (HONOR) లాంచ్ ఈవెంట్‌లో HONOR Magic8 స్మార్ట్‌ఫోన్ సిరీస్ ఆధారంగా రూపొందించిన AI కాన్సెప్ట్ వర్షన్ హానర్ రోబోట్ ఫోన్ (HONOR Robot Phone) ను పరిచయం చేసింది. ఈ డివైజ్ హానర్ AI ప్రొడక్ట్ ఎకోసిస్టమ్ లో భాగంగా నిలిచేలా రూపొందించబడింది. ఇక హానర్ కంపనీ ప్రకారం ఈ కొత్త రోబోటిక్ ఫోన్ మల్టీ మోడల్ ఇంటెలిజెన్స్, ఆధునిక రోబోటిక్స్, నెక్స్ట్ జెనరేషన్ ఇమేజింగ్ ను కలిపి రూపకల్పన చేయబడింది. ఇందులో AI సిస్టమ్ ద్వారా పర్యావరణాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం కల్పించారు. అలాగే రోబోటిక్ మొబిలిటీ ఫీచర్‌తో ఇది స్వతంత్రంగా కదలగలదు. ముఖ్యంగా వ్యక్తిగత కెమెరాగా పనిచేయగల సామర్థ్యం కలిగి ఉండటమే దీని ప్రధాన ఆకర్షణ. ఇది వినియోగదారుల జీవితంలోని సెలెబ్రేషన్స్, రోజువారీ క్షణాలను సులభంగా చిత్రీకరించగలదు.

డ్యూయల్ టోన్ ఫినిషింగ్, టచ్ కంట్రోల్‌లతో Honor Earbuds 4 లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా..!

ఈ రాబోయే మొబైల్ సంబంధించి HONOR పోస్ట్ చేసిన వీడియోలో.. రోబోట్ ఫోన్ వినియోగదారుల దుస్తుల ఎంపికలో సహాయం చేయడం, డైనమిక్ షాట్స్, ఇంకా స్కైడైవింగ్ సమయంలో వీడియో తీసుకోవడం వంటి పనులు ఎలా చేయవచ్చు ఇందులో చూపించారు. ఈ కొత్త మొబైల్ “హానర్ ఆల్ఫా ప్లాన్” (HONOR ALPHA PLAN) లో భాగంగా రూపొందించబడింది. నిజానికి ఈ మొబైల్ ఈ ఏడాది ప్రారంభంలోనే ప్రకటించబడింది. హానర్ రోబోట్ ఫోన్ ను ఇంటెలిజెంట్ డివైజుల పరిణామంలో తదుపరి దశగా కంపెనీ పేర్కొంది. ఈ మొబైల్ సాధారణ స్మార్ట్‌ఫోన్ల నుండి AI ఆధారిత ఫోన్ల వైపు మార్పును ప్రతిబింబిస్తుంది. ఈ మొబైల్ ద్వారా త్వరలో హానర్ ప్రపంచవ్యాప్తంగా AI డివైజ్ ఎకోసిస్టమ్ లో సంచనాలను సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ ఈ హానర్ రోబోట్ ఫోన్ ను అధికారికంగా MWC 2026, బార్సిలోనాలో ప్రదర్శించనుంది.

మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో ‘Digital Campus on Google Cloud’ ప్రారంభం..!

Exit mobile version