HONOR Power2: రూమర్లకు ముగింపు పలుకుతూ హానర్ (HONOR) పవర్ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ HONOR Power2ను అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్‌ను 2026 జనవరి 5న చైనాలో విడుదల చేయనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. MediaTek Dimensity 8500 Elite ప్రాసెసర్‌తో వచ్చే తొలి స్మార్ట్‌ఫోన్‌గా ఇది నిలవనుంది. HONOR Power2లో నాల్గో తరం సిలికాన్-కార్బన్ బ్యాటరీని ఉపయోగించారు. దీని సామర్థ్యం 10,080mAh. ఇది భారీ స్థాయిలో ఉన్న హానర్ విన్ సిరీస్‌లోని 10,000mAh బ్యాటరీకంటే ఎక్కువ. దీంతో అత్యధిక సిలికాన్-కార్బన్ బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఫోన్‌గా HONOR Power2 కొత్త రికార్డు సృష్టించనుంది. బ్యాటరీకి 80W SuperCharge ఫాస్ట్ చార్జింగ్, అలాగే 27W రివర్స్ చార్జింగ్ సపోర్ట్ కూడా అందిస్తుంది.
CP Sajjanar: తాగి బండి నడిపారో.. వెళ్లేది ఇంటికి కాదు.. నేరుగా చంచల్‌గూడ జైలుకే..!
‘Saber’ అనే కోడ్‌నేమ్‌తో వస్తున్న ఈ ఫోన్‌లో 6.79 అంగుళాల 1.5K (2640×1200 పిక్సెల్స్) LTPS ఫ్లాట్ OLED డిస్‌ప్లే, గరిష్టంగా 8000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, మెటల్ ఫ్రేమ్ డిజైన్ ఉన్నాయి. ఇక కెమెరా విభాగంలో 50MP రియర్ మెయిన్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా ఉంటాయి. విడుదలైన ఇమేజ్ ప్రకారం వెనుక భాగంలో పెద్ద కెమెరా డెకోలో ట్రిపుల్ రియర్ కెమెరాలు కనిపిస్తున్నాయి. భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ, HONOR Power2 మొబైల్ కేవలం 7.98mm మందం, 216 గ్రాముల బరువుతో స్లిమ్ డిజైన్‌ను కలిగి ఉండటం విశేషం.
అండర్ డిస్‌ప్లే 3D ఫేస్ రికగ్నిషన్ సపోర్ట్ తో రానున్న Xiaomi Mix 5..!
ఈ స్మార్ట్‌ఫోన్ 12GB RAM + 256GB స్టోరేజ్, 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఆరెంజ్, వైట్, బ్లాక్ అనే కలర్ ఆప్షన్లలో ఇది లభిస్తుంది. HONOR Power2ను 2026 జనవరి 5న చైనాలో విడుదల చేయనున్నారు. త్వరలోనే ధరతో పాటు మరిన్ని అధికారిక వివరాలను కంపెనీ వెల్లడించనుంది.
