100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
- చైనాలో హానర్ మ్యాజిక్ 9 ప్రో మాక్స్ లాంచ్
- డ్యూయల్ 200MP ARRI కో-బ్రాండెడ్ కెమెరా సిస్టమ్
- 200MP మెయిన్, 200MP టెలిఫోటో, 50MP అల్ట్రా-వైడ్ కెమెరాలు
- 55MP ఫ్రంట్ కెమెరా, 3D డెప్త్ సెన్సింగ్ కెమెరా
- 6.8 అంగుళాల LTPO OLED డిస్ప్లే, 10,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్
- స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్ట్రీమ్ జెన్ 6 చిప్సెట్
- 8,800mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ, 100W వైర్డ్, 80W వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్
- నాలుగు మైక్రోఫోన్ల సినిమాటిక్ డైరెక్షనల్ ఆడియో సిస్టమ్
- 3D ఫేస్ రికగ్నిషన్, 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెక్యూరిటీ
- IP68, IP69, IP69K రక్షణ రేటింగ్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HONOR Magic9 Pro Max: హానర్ మ్యాజిక్ 9 సిరీస్‌లో భాగంగా మ్యాజిక్ 9 Pro Max స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసింది. ఈ మోడల్లో 200MP మెయిన్ కెమెరా, 200MP టెలిఫోటో కెమెరా, ARRI సినిమాటిక్ కెమెరా టెక్నాలజీ, స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్ట్రీమ్ జెన్ 6 చిప్సెట్, 8,800mAh బ్యాటరీ వంటి హై-ఎండ్ ఫీచర్లు ఉన్నాయి.
డ్యూయల్ 200MP కెమెరా సెటప్
ఈ కొత్త మొబైల్లో డ్యూయల్ 200MP ARRI కో-బ్రాండెడ్ కెమెరా సిస్టమ్ ఉంది. ఇందులో 1/1.28-అంగుళాల సెన్సార్, f/1.57 అపెర్చర్‌తో 200MP మెయిన్ కెమెరా ఉంది. ఇది CIPA 8.0 స్టెబిలైజేషన్‌తో పాటు 3-డిగ్రీ గింబల్-లెవల్ స్టెబిలైజేషన్‌ను సపోర్ట్ చేస్తుంది.
Also Read
- ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
- Oppo F35 Series: Oppo F35 సిరీస్ వచ్చేస్తోంది.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
200MP టెలిఫోటో కెమెరాకు 1/1.4-అంగుళాల సెన్సార్, f/2.6 అపెర్చర్, CIPA 8.0 స్టెబిలైజేషన్ ఉన్నాయి. ఇందులో AiMAGE క్లారిటీ ఇంజిన్ కూడా ఉంది. ఇవే కాకుండా 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, 55MP ఫ్రంట్ కెమెరా, 3D డెప్త్-సెన్సింగ్ కెమెరాను అందించారు.
అలాగే ఇందులో ARRI ఇమేజ్ సైన్స్ ఆధారిత సెన్సార్ కాలిబ్రేషన్, ARRI LogC3, 10-bit కలర్ డెప్త్, ARRI వైడ్ గామెట్ 3 వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కెమెరా పైప్‌లైన్ సిగ్నల్-టు-నాయిస్ రేషియోను 8dB వరకు మెరుగుపరుస్తుందని HONOR పేర్కొంది. అలాగే 14 స్టాప్ల వరకు సినిమాటిక్ డైనమిక్ రేంజ్‌కు సపోర్ట్ ఉంటుంది. ARRI సినిమా మోడ్ ద్వారా 4K 60fps వరకు వీడియో రికార్డింగ్ చేయవచ్చు. 14 ప్రీసెట్ ARRI లుక్స్ తో పాటు మొత్తం 87 ARRI లుక్ లైబ్రరీ ప్రొఫైల్స్ అందుబాటులో ఉన్నాయి.
Magic9 Pro Maxకు ప్రత్యేకంగా టెలిఫోటో యాక్సెసరీస్‌ను కూడా అందిస్తున్నారు. G200 ఎక్స్టెండర్ ద్వారా 85mm నేటివ్ ఫోకల్ లెంగ్త్‌ను 200mm సమానమైన ఫోకల్ లెంగ్త్‌కు పెంచుకోవచ్చు. G500 ఎక్స్టెండర్ ద్వారా 500mm సమానమైన ఫోకల్ లెంగ్త్‌ను పొందవచ్చు. అలాగే SmallRig ప్రొఫెషనల్ వీడియో ఎక్సపెన్షన్ రిగ్ ద్వారా ప్రొఫెషనల్ వీడియో షూటింగ్ కోసం అదనపు మౌంటింగ్ ఆప్షన్స్ లభిస్తాయి.
సినిమాటిక్ ఆడియో
వీడియో రికార్డింగ్‌కు అనుగుణంగా ఫోన్లో నాలుగు మైక్రోఫోన్ల “సినిమాటిక్ డైరెక్షనల్ మైక్రోఫోన్” సిస్టమ్ ఉంది. ఇది 20 మీటర్ల వరకు డైరెక్షనల్ ఆడియో పికప్‌ను అందిస్తుంది. హార్డ్‌వేర్-లెవల్ నాయిస్ రిడక్షన్ సామర్థ్యం 462%, పికప్ సెన్సిటివిటీ 158% పెరిగినట్లు కంపెనీ తెలిపింది. అలాగే 8cc అకౌస్టిక్ చాంబర్, 0.88mm స్పీకర్ స్ట్రోక్, HONOR Sound AI స్పేషియల్ ఆడియో ఉన్నాయి.
OLED డిస్ప్లే
మ్యాజిక్ 9 ప్రో మాక్స్ లో 6.8 అంగుళాల LTPO OLED డిస్ప్లే ఉంది. ఇది 1320 × 2868 పిక్సెల్స్ రిజల్యూషన్, 464ppi, DCI-P3, 1.07 బిలియన్ కలర్స్‌తో వస్తుంది. 1Hz నుంచి 120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే గరిష్ఠంగా 10,000 నిట్స్ బ్రైట్నెస్ను అందిస్తుంది. 20 శాతం విండోలో 6,000 నిట్స్, గ్లోబల్ బ్రైట్నెస్ 2,000 నిట్స్, కనిష్ఠంగా 1 నిట్ వరకు బ్రైట్నెస్ ఉంటుంది.
స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్ట్రీమ్ జెన్ 6
పనితీరు కోసం Snapdragon 8 Elite Extreme Gen 6 మొబైల్ ప్లాట్ఫారంను ఉపయోగించారు. భారీ కెమెరా ప్రాసెసింగ్, గేమింగ్, మల్టీటాస్కింగ్ వంటి పనులకు అనుగుణంగా ఈ ఫోన్‌ను రూపొందించారు.
8,800mAh బ్యాటరీ & 100W ఫాస్ట్ ఛార్జింగ్
ఫోన్లో 8,800mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఉంది. ఇది 1,000Wh/L ఎనర్జీ డెన్సిటీ, 40 శాతం సిలికాన్-కార్బన్ యానోడ్ కంపోజిషన్‌తో వస్తుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే 100W వైర్డ్, 80W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 300కు పైగా కార్ మోడళ్లలో 50W వైర్లెస్ ఛార్జింగ్‌కు కూడా ఇది అనుకూలంగా ఉంటుంది.
అధునాతన సెక్యూరిటీ
5,600 లేయర్ల సిలికాన్ నైట్రైడ్ కోటింగ్‌తో స్క్రీన్ రిఫ్లెక్టివిటీని 1.5 శాతానికి తగ్గించినట్లు HONOR తెలిపింది. Diamond Giant Rhinoceros Glass ద్వారా డ్రాప్, స్క్రాచ్, వేర్ రెసిస్టెన్స్‌ను మెరుగుపరిచినట్లు కంపెనీ పేర్కొంది. సెక్యూరిటీ కోసం 3D పేస్ రెకగ్నిషన్, 3D అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ రెకగ్నిషన్ ఉన్నాయి. వీటికి C3 RF, HONOR Hongyan AI Cloud Map, IP68/IP69/IP69K రక్షణ లభిస్తుంది.
ధరలు
* 12GB + 256GB: 6,499 యువాన్ (సుమారు రూ.92,920).
* 12GB + 512GB: 6,999 యువాన్ (సుమారు రూ.1,00,070).
* 16GB + 512GB: 7,499 యువాన్ (సుమారు రూ.1,07,220).
* 16GB + 1TB: 8,499 యువాన్ (సుమారు రూ.1,21,520).
తాజావార్తలు
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
US Tariff: అమెరికా నుంచి భారత్‌కు భారీ ఊరట.. వాటిపై 0% టారిఫ్..!
-
Virat Kohli: ఏ తప్పేముంది.. విరాట్ కోహ్లీ అది కోరుకోవడం సహజమే: రహనే
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
India vs Pakistan: ఏషియన్ గేమ్స్‌లో బిగ్ ఫైట్.. భారత్-పాకిస్థాన్ మధ్య ఫైనల్ పోరు..? కానీ..
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!