Site icon NTV Telugu

HONOR Magic V5: ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ డ్యూరబిలిటీలో సరికొత్త చరిత్ర.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన హానర్ మ్యాజిక్ V5!

Honor Magic V5

Honor Magic V5

HONOR Magic V5: హానర్ మ్యాజిక్ V5 స్మార్ట్‌ఫోన్ ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది. అయితే తాజగా ఈ స్మార్ట్‌ఫోన్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది. ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో ఇంతవరకు నమోదు కాని ఘనతను పొందింది. అదేంటంటే, 104 కిలోల (229.2 lbs) బరువును ఈ ఫోన్ లిఫ్ట్ చేయగలిగింది. ఈ అద్భుత రికార్డును ఆగస్టు 1న దుబాయ్‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికార ప్రతినిధి ఎమ్మా బ్రెయిన్ పర్యవేక్షణలో నమోదు అయింది.

Film Workers Strike: 24 క్రాఫ్ట్స్ కార్మిక సంఘాల నిరసన.. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం!

ఈ అవార్డు రావడానికి ప్రధాన కారణం హానర్ ప్రత్యేకంగా రూపొందించిన ‘సూపర్ స్టీల్ హింజ్’. ఇది 5,00,000 సార్లు ఫోల్డింగ్‌ను తట్టుకునే శక్తితో పాటు 100 కిలోలకుపైగా బరువును నిలువుగా లిఫ్ట్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. హానర్ సూపర్ స్టీల్‌తో తయారు చేసిన ఈ హింజ్‌కి 2300 MPa వరకు టెన్సైల్ స్ట్రెంగ్ తో ఉండటం దీని బలం. అదనపు బరువు లేకుండా ఎక్కువ మన్నికను అందించగలగడం దీని ప్రత్యేకత.

Samsung Galaxy Buds 3 FE: ANC, AI ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 3 FE లాంచ్!

హానర్ మ్యాజిక్ V5 ఫోల్డబుల్ అయినప్పటికీ కేవలం 8.8mm మందం మాత్రమే ఉండి, 217 గ్రాముల తేలికపాటి బరువుతో అందుబాటులో ఉంది. దీనివల్ల మన్నిక, సౌకర్యం, స్లిమ్ డిజైన్ మూడు ముఖ్య లక్షణాలను ఒకేసారి అందిస్తోంది. ఫోల్డబుల్ ఫోన్ల మన్నికపై ఉండే సందేహాలను ఈ ఫోన్ పూర్తిగా చెరిపేసిందని చెప్పవచ్చు. చైనాలో ముందుగా విడుదలైన హానర్ మాజిక్ V5.. ఆగస్టు 28, 2025న లండన్‌లో గ్లోబల్ లాంచ్ కానుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు ఈ ప్రత్యేకమైన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ అనుభూతిని అనుభవించనున్నారు.

Exit mobile version